Homeక్రైమ్‌Fake Dating Apps Scam: ఈ అమ్మాయిలు చాలా ఖతర్నాక్.. ఒంటరిగా ఉన్న అబ్బాయిలను టార్గెట్...

Fake Dating Apps Scam: ఈ అమ్మాయిలు చాలా ఖతర్నాక్.. ఒంటరిగా ఉన్న అబ్బాయిలను టార్గెట్ చేస్తారు.. ఆ తర్వాత జరిగేది అదే..

Fake Dating Apps Scam: నేటి కాలంలో మోసాలు జరిగే తీరు మారిపోతుంది. అదేదో సినిమాలో చెప్పినట్టు జేబుకు తెలియకుండా పర్స్ కొట్టేస్తున్నారు. మనం తేరుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అందువల్లే ఇటువంటివి జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా లేపోతే అంతే సంగతులు.

ఇటీవల కాలంలో టెక్నాలజీ ఆధారంగా మోసాలు చేయడం పెరిగిపోయింది. ముఖ్యంగా కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కొన్ని యాప్స్ ద్వారా అక్రమార్కులు మోసాలకు పాల్పడుతున్నారు. భారీగా దండుకొని.. నిండా ముంచుతున్నారు. ఈ మోసంలో ఒంటరిగా ఉన్న అబ్బాయిలనే లక్ష్యంగా చేసుకోవడం విశేషం.

డేటింగ్ ట్రెండ్ అనేది మనదేశంలో విస్తృతంగా ఉంది. గతంలో ఈ కల్చర్ ఉండేది కాదు. ఈ కల్చర్ వల్ల అబ్బాయిలు.. అమ్మాయిలు పెళ్లి కాకముందే మొదలు పెడుతున్నారు. మోజు తీరిపోయిన తర్వాత ఎవరికి వారు అన్నట్టుగా ఉంటున్నారు. అయితే డేటింగ్ యాప్స్ ద్వారా జరుగుతున్న వ్యవహారాలను చూసిన కొంతమంది అక్రమార్కులు నకిలీ డేటింగ్ యాప్స్ రూపొందిస్తున్నారు. వీటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.

నకిలీ డేటింగ్ యాప్స్ లో ఏ ఐ ద్వారా అమ్మాయిలను సృష్టిస్తున్నారు. వీడియోలు రూపొందిస్తున్నారు. నకిలీ అమ్మాయిలతో రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు.”మేము అందంగా ఉంటాం. పెళ్లి చేసుకోవడం మాకిష్టం ఉండదు. కేవలం కబుర్లు చెప్పడం మాత్రమే ఇష్టం. ఒంటరిగా ఉంటే మాత్రం మాతో మాట్లాడొచ్చు. ఆ తర్వాత ఎక్కడ దాకైనా వెళ్లొచ్చు” అంటూ కసిగా మాట్లాడతారు. యాప్స్ లో చేర విధంగా రెచ్చగొడతారు. కైపు కలిగించే ఫొటోలు పోస్ట్ చేస్తారు. మోహం కలిగించే వీడియోలతో ఉద్రేకపరుస్తారు. అవన్నీ నిజమని నమ్మితే నిండామునగడం ఖాయం. ఆ తర్వాత నెత్తీనోరు కొట్టుుకున్నా ఉపయోగం ఉండదు.

వ్యక్తిగత వివరాలు.. ఎంట్రీ చేయాలని చెబుతారు. ఆ తర్వాత అసలు కథ మొదలు పెడతారు. బ్లాక్మెయిలింగ్ చేసి.. డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠా బ్లాక్మెయిలింగ్ కు దిగిన తర్వాత డబ్బులు వసూలు చేయడం మొదలుపెడుతుంది. రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుంది. డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వదిలిపెట్టదు. అందువల్లే ఇటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular