SI Sriramulu Srinu: అశ్వారావుపేట ఎస్సై ఉదంతంలో మరో తీరని శోకం.. ఆయనే కాదు.. అత్తనూ వెంటాడిన మృత్యువు

శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే అతడు చికిత్స పొందుతూ హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సీఐ జితేందర్ రెడ్డి, నలుగురు కానిస్టేబుళ్లు ఆయనను వేధించారని తెలుస్తోంది. విధి నిర్వహణలో సహకరించకపోగా.. అతడిని కులం పేరుతో దూషించారని సమాచారం. దీనికి సంబంధించి ఎస్ఐ శ్రీను ఓ వీడియోలో తన ఆవేదనను వెల్లబోసుకున్నాడు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు కొన్ని చర్యలు తీసుకోగా.. శ్రీను సతీమణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 7, 2024 4:23 pm

SI Sriramulu Srinu

Follow us on

SI Sriramulu Srinu: తనను వేధిస్తున్నారని ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను వారం రోజుల క్రితం కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆ తర్వాత అతడిని 108, పోలీస్ సిబ్బంది హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశాడు. ఆయన మరణానికి కారణమనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు.

శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే అతడు చికిత్స పొందుతూ హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సీఐ జితేందర్ రెడ్డి, నలుగురు కానిస్టేబుళ్లు ఆయనను వేధించారని తెలుస్తోంది. విధి నిర్వహణలో సహకరించకపోగా.. అతడిని కులం పేరుతో దూషించారని సమాచారం. దీనికి సంబంధించి ఎస్ఐ శ్రీను ఓ వీడియోలో తన ఆవేదనను వెల్లబోసుకున్నాడు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు కొన్ని చర్యలు తీసుకోగా.. శ్రీను సతీమణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గత నెల 30వ తేదీన శ్రీను స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్ళాడు. ఎంతసేపటికి రాకపోయేసరికి అశ్వారావుపేట పోలీసులు గాలించారు. ఈలోగా అతడే 108 కు ఫోన్ చేశాడు. తాను మహబూబాబాద్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్టు చెప్పాడు. అతడు చెప్పిన అడ్రస్ వద్దకు వెళ్లిన 108 సిబ్బంది వెళ్లారు. పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు. వారంతా హుటాహుటిన ఆయనను హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న శ్రీను ఆదివారం కన్నుమూశారు. ఇప్పటికే శ్రీను ఆత్మహత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అశ్వారావుపేట సీఐ జితేందర్ రెడ్డి ని వరంగల్ ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. నలుగురు కానిస్టేబుళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

తన భర్త ఆత్మహత్యకు సీఐ జితేందర్ రెడ్డి, నలుగురు కానిస్టేబుళ్లు కారణమని ఎస్సై శ్రీను భార్య కృష్ణవేణి పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. వారిపై ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ” నలుగురు కానిస్టేబుళ్లు నా మాట వినడం లేదు. పైగా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని మీడియాకు లీకులు ఇస్తున్నారు.. ఇదే విషయాన్ని సీఐ జితేందర్ రెడ్డి కి ఫిర్యాదు చేశాను. అయినప్పటికీ ఆయన చర్యలు తీసుకోలేదు. పైగా నాకు మెమోలు ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు నాకు అర్థమైంది.. వీళ్లు కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారని.. చివరికి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నాను. అది ఆలస్యమైందని” శ్రీను తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

శ్రీను ఈ ఏడాది ఫిబ్రవరిలో మణుగూరు పోలీస్ స్టేషన్ మంచి బదిలీపై అశ్వారావుపేట వెళ్లారు. ఆయన స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్క పేట. 2014లో ఎస్సైగా ఎంపికయ్యారు.. అశ్వారావుపేట సీఐ జితేందర్ రెడ్డి, కానిస్టేబుళ్లు శేఖర్, శివ నాగరాజు, సన్యాసినాయుడు, సుభాని విధుల్లో తనకు సహకరించలేదని శ్రీను వీడియోలో పేర్కొన్నాడు. పైగా తనను తీవ్రంగా వేధించారని, కులం పేరుతో కించపరచాలని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు సీఐ జితేందర్ రెడ్డి 4 నెలల్లోనే 4 మెమోలు ఇవ్వడంతో తాను ఆవేదనకు గురయ్యానని శ్రీను పేర్కొన్నాడు.. మరోవైపు శ్రీను మరణ వార్త విని ఆయన మేనత్త రాజమ్మ (70) గుండెపోటుకు గురై మరణించారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.