Bangalore: ఒక మనిషికి అహం పెరిగిపోతే.. ఎదుటి వ్యక్తిపై పగ తీర్చుకోవాలి అనుకుంటే ఎక్కడ దాకైనా వెళ్తాడు. ఎంత దాకా అయినా వెళ్తాడు. ఎంతటి ఘోరానికైనా పాల్పడేందుకు వెనుకాడడు. అటువంటి సంఘటన ఇది. వాస్తవానికి ఇటువంటి దృశ్యాలను మనం సినిమాలలో చూస్తాం. కాకపోతే వాస్తవ జీవితంలో అంతకంటే ఎక్కువ ఘోరాలు నేటి కాలంలో జరుగుతున్నాయి.
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఓ వీడియో గగుర్పాటుకు గురిచేస్తోంది. ఆ వీడియోలో ఓ కారు అత్యంత వేగంగా వెళ్తోంది. అంతే వేగంతో ఓ బైకర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ బైకర్ కన్నుమూశాడు. ఆ బైకర్ తో వారికి గొడవలు లేవు. పగలు అంతకన్నా లేవు. ప్రతీకారాలు కూడా లేవు. కానీ అంతటి దారుణానికి పాల్పడడానికి కారణం ఉంది.
ఆ కారు ఓనర్ల పేరు మనోజ్, ఆర్తి. మనోజ్, ఆర్తి కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రాంతానికి వెళ్లారు. అలా వారు వెళుతున్న సమయంలో ఓ బైకర్ వారి కారు సైడ్ మిర్రర్ ను ఢీకొట్టాడు. అయితే తెలియక చేశానని చెప్పినప్పటికీ మనోజ్, ఆర్తి ఒప్పుకోలేదు. పైగా అతనిపై దుర్భాషలాడారు. ఒకానొక దశలో మనోజ్ అతనిపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించాడు. చుట్టుపక్కల వాళ్లు సర్ది చెప్పడంతో మనోజ్ వెనక్కి తగ్గాడు. అయినప్పటికీ మనోజ్, ఆర్తి కి కోపం తగ్గలేదు. పైగా ఆ బైకర్ ను కారులో అనుసరించారు. చివరికి తమ కారుతో అతడి బైకును ఢీ కొట్టి పారిపోయారు. ఈ ప్రమాదంలో ఆ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి దుర్మరణం చెందాడు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిసిటి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కారు నెంబర్ ను పరిశీలించి ఈ ఘటనకు పాల్పడింది మనోజ్, ఆర్తి అని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని.. విచారిస్తే అసలు విషయాలు చెప్పారు.
విచారణలో మనోజ్ చెప్పిన విషయాలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేసాయి. సైడ్ మిర్రర్ కు బైక్ ఢీకొంటేనే ఇంతటి దారుణానికి పాల్పడతారా అంటూ పోలీసులు ప్రశ్నిస్తే.. మనోజ్ దంపతులు సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఓ బైకర్ ప్రాణం పోవడానికి కారణమైన ఆ దంపతులను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.
కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని.. కారుతో గుద్ది చంపేసిన దంపతులు
రెండు కిలోమీటర్ల పాటు వెంటాడి మరీ చంపిన జంట
కర్ణాటకలోని బెంగళూరులో చోటు చేసుకున్న దారుణ ఘటన
అయితే మనోజ్, ఆర్తి దంపతులు కారులో వెళ్తుండగా.. అనుకోకుండా కారు సైడ్ మిర్రర్‌కు అతని బైక్ తగిలించిన దర్శన్ అనే వ్యక్తి… pic.twitter.com/PA1g8dWDGo
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2025