Homeఆంధ్రప్రదేశ్‌Boggula Srinivas: పవన్ కళ్యాణ్ హఠావో అన్న వ్యక్తి అనుమానాస్పదంగా హఠాన్మరణం... అసలేం జరిగింది?

Boggula Srinivas: పవన్ కళ్యాణ్ హఠావో అన్న వ్యక్తి అనుమానాస్పదంగా హఠాన్మరణం… అసలేం జరిగింది?

Boggula Srinivas: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది ఇన్ఫ్లుయన్సర్స్ గా మారిపోతున్నారు. ఓవర్ నైట్ లో వచ్చిన గుర్తింపుతో ఇన్ఫ్లుయన్సర్స్ తమకు తాముగా గొప్ప వాళ్ళమని చెప్పుకుంటున్నారు. దైవంశ సంభూతులమని పేర్కొంటున్నారు.

ఇక కొందరు ఇన్ఫ్లుయన్సర్స్ అయితే మరింత రెచ్చిపోతున్నారు. రాజకీయ పార్టీల మోచేతి నీళ్లు తాగుతూ.. ప్రత్యర్థుల మీద అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ తరహా బాపతు గాళ్ళు పెరిగిపోయారు. యూట్యూబ్ గొట్టాన్ని మూతి ముందు పెట్టుకోవడం.. లొట్టిమీద కాకిలాగా అరవడం వంటి వాటిని అలవాటు చేసుకున్నారు.

ఒకప్పుడు ఎన్నికల ముందే ఈ తరహా కిరాయి వ్యక్తులు కనిపించేవారు. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి వ్యక్తులతో దీర్ఘకాలం చేయించుకుంటున్నాయి. ఒకరకంగా వారిని ఇన్ ఫ్లూ యన్సర్స్ గా మార్చుకుంటున్నాయి.

ఏపీలో వైసీపీకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ లు చాలామంది ఉన్నారు. అందులో బొగ్గుల శ్రీనివాస్ అనే వ్యక్తి కీలకంగా ఉన్నాడు. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఈయన ఇష్టానుసారంగా మాట్లాడాడు. అంతేకాదు పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో అనే పుస్తకాన్ని రూపొందించాడు. యూట్యూబ్లో పవన్ కళ్యాణ్ మీద అడ్డగోలుగా విమర్శలు చేసేవాడు. వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడేవాడు.

బొగ్గుల శ్రీనివాస్ వ్యవహార శైలి పట్ల జనసైనికులు అనేక సందర్భాలలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ కూడా చేశారు. అప్పట్లో బొగ్గుల శ్రీనివాస్ కొద్ది రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు బొగ్గుల శ్రీనివాస్ ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు…

బొగ్గుల శ్రీనివాస్ ప్రయాణిస్తున్న కారు పాలేరు జలాశయంలోకి దూసుకుపోయింది. ఆ కారులో శ్రీనివాసు వెనుక భాగంలో కూర్చున్నాడు. కారు తోలుతున్న డ్రైవర్ కిందపడ్డాడు. ఆ తర్వాత అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. శ్రీనివాస్ స్వస్థలం కర్నూలు జిల్లా. ఇతడికి వైసిపి అంటే చాలా ఇష్టం. అందువల్లే పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవాడు. వ్యక్తిగతంగా కూడా లక్ష్యంగా చేసుకొని అడ్డగోలుగా మాట్లాడేవాడు.

శ్రీనివాస్ మరణం పట్ల జనసైనికులు విచారం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మీద అనుచితంగా వ్యాఖ్యలు చేశాడని.. ఇప్పుడేమో ఇలా అయిపోయాడని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ మీద అడ్డగోలుగా మాట్లాడే ఎవరికైనా సరే ఇటువంటి పరిస్థితే ఎదురవుతుందని జనసైనికులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version