Madanapalle CI Marriage: న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. ఆమెకు మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు ఆ పోలీస్ అధికారి. రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే సదరు మహిళ భర్త ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని కర్ణాటక ఉమ్మడి జిల్లాలో వెలుగు చూసింది ఈ ఘటన. పోలీస్ శాఖ లో హాట్ టాపిక్ అవుతోంది. పోలీస్ శాఖ కఠిన చర్యలకు దిగే అవకాశం కనిపిస్తోంది.
Also Read: అయ్యర్ కోసం రంగంలోకి ప్రీతిజింటా.. బీసీసీఐ తో ఢీ!
* కుటుంబ కలహాల నేపథ్యంలో..
వైయస్సార్ కడప( YSR Kadapa) జిల్లాకు చెందిన పవన్ హైదరాబాదులో స్థిరపడ్డారు. దుబాయిలో ఐటీ ఉద్యోగిగా ఉండేవారు. అప్పుడప్పుడు ఏపీకి వచ్చేవారు. 2018లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నారు. అయితే కొద్ది రోజులకే వారి కుటుంబంలో కలహాలు రేగాయి. దీంతో మదనపల్లి డిఎస్పీ కార్యాలయంలో కంప్లైంట్ చేసేందుకు ఆమె వెళ్లారు. అక్కడ సీఐగా పని చేసే సురేష్ కుమార్ పరిచయమయ్యారు. అలా ఆమెకు దగ్గరయ్యారు అని ఆరోపిస్తున్నాడు పవన్. అంతటితో ఆగకుండా రెండో పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నాడు. అయితే 2021లో తనకు ఆ విషయం తెలిసిందని చెప్పుకొస్తున్నాడు. ఈ క్రమంలో 2023లో ఆమె ఒక పాపకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే పవన్ హైకోర్టులో ప్రైవేటు కేసు వేయించారు. అయితే ఈ కేసు విషయంలో చార్జ్ షీట్ దాఖలు చేయకుండా పోలీసులు జాప్యం చేశారని పవన్ చెబుతున్నాడు.
* కుల ధ్రువీకరణ పై ఫిర్యాదు..
చివరకు పవన్ ప్రధానమంత్రి( Prime Minister) కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం ఈ ఏడాది జూన్లోనే దీనిపై వివరణ కోరుతూ జిల్లా పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. వెనువెంటనే సదరు సిఐ పై కేసు నమోదు చేశారు. అయితే పవన్ తన ఫిర్యాదులో సీఐ కులం పై కూడా ఫిర్యాదు చేశారు. సీఐ సురేష్ కుమార్ తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకున్నారని.. తల్లి కుల ధ్రువీకరణ పత్రం ద్వారా అతడు ఉద్యోగం సొంతం చేసుకున్నట్లుగా బాధితుడు ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. అయితే సదరు సీఐ సెలవు మీద వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. చివరిగా ఎటు వెళ్తుందో చూడాలి.