https://oktelugu.com/

Cell Phone : చార్జింగ్ పెట్టి వీడియోలు చూసింది.. బాలిక చేతిలో సెల్ ఫోన్ పేలి ప్రాణం మీదకొచ్చింది..

అయితే టెక్నాలజీ పెరుగుతుండడం మంచి విషయమే అయినా.. కానీ అనర్ధాలు అదే స్థాయిలో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పిల్లల చేతిలో సెల్ ఫోన్ ఉండే సమయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే మూల్యం తప్పదు.

Written By:
  • NARESH
  • , Updated On : April 21, 2024 10:37 am

    Cell Phone

    Follow us on

    Cell Phone : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ నిత్యావసరంగా మారింది. ప్రతి ఒక్కరి చేతిలో కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచం మన అరచేతిలో ఉన్నట్టే. అయితే స్మార్ట్ ఫోన్ తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్ని అనర్ధాలు కూడా. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాతే ఆన్లైన్ మోసాలు పెరిగాయి. చెడు వ్యసనాలు దాపురించాయి. ఆన్లైన్ జూదాలకు అలవాటు పడుతున్న యువత పక్కదారి పడుతున్నారు. అదే సమయంలో సెల్ ఫోన్లు పేలిపోతున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు క్షతగాత్రులుగా మిగులుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో సెల్ఫోన్ పేలి ఓ బాలిక తీవ్ర గాయాల పాలయ్యింది.

    ఎమ్మాజి గూడెంలో వీరలక్ష్మి అనే ఓ బాలిక సెల్ఫోన్ కు చార్జింగ్ పెట్టి వీడియోలు చూస్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా సెల్ఫోన్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో బాలిక కుడి చేతి రెండు వేళ్లు పూర్తిగా తెగిపోయాయి. పొట్ట భాగంలోనూ గాయాలయ్యాయి. తల్లిదండ్రులు వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. అయితే అప్పటికే చార్జింగ్ పెట్టి చాలా సమయం అయ్యింది. అది చూసుకొని బాలిక వీరలక్ష్మి చార్జింగ్ లో ఉండగానే వీడియోలు చూస్తోంది. దీంతో ఒక్కసారిగా సెల్ ఫోన్ పేలిపోయింది.

    ఫోన్లు వాడేవారు తప్పకుండా బ్రాండెడ్ ఫోన్లు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ మాట్లాడకూడదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ఎక్కువగా వేడి అవుతుంటే దానిని వాడకూడదని సూచిస్తున్నారు. అయితే సెల్ ఫోన్ అనేది నిత్యవసరంగా మారిపోయింది. ప్రస్తుతం చేతిలో సెల్ ఫోన్ లేని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వినియోగం భారీగా పెరుగుతోంది. డేటా చౌకగా దొరకడంతో ఎక్కువమంది సెల్ ఫోన్ కు ఆడిక్ట్ అవుతున్నారు. అయితే టెక్నాలజీ పెరుగుతుండడం మంచి విషయమే అయినా.. కానీ అనర్ధాలు అదే స్థాయిలో పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పిల్లల చేతిలో సెల్ ఫోన్ ఉండే సమయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే మూల్యం తప్పదు.