https://oktelugu.com/

Best Millage Car: AC ఆన్ లో ఉంచినా 30 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తున్న కారు.. ప్రూఫ్ ఇదిగో..

సీఎన్జీ వెర్షన్ సక్సెస్ అయినట్లు తాజాగా వెలువడిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఎక్స్ టర్ సీఎన్ జీ వెర్షన్ లో 33 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చినట్లు ఓ కారు వినియోదారుడు దీపక్ రాయ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 21, 2024 / 10:57 AM IST

    Hyundai Exter

    Follow us on

    Best Millage Car: కాలం మారుతున్న కొద్దీ కార్ల టెక్నాలజీ మారుతోంది. ఒకప్పుడు కారు కొనాలనుకునేవారు ధర, ఫీచర్స్ మాత్రమే చూసేవారు. నాటి కార్లు ఎక్కువ మైలేజ్ ఇచ్చేవి కావు. కానీ ఇప్పుడు అధునాతన టెక్నాలజీని ఉపయోగించి మైలేజ్ ఎక్కువ ఇచ్చే కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్ కంటే సీఎన్ జీ కార్ల మైలేజ్ అంచనాలు మించిపోతున్నాయి. కంపెనీలు ఇచ్చే ప్రకటనలు మాత్రమే కాకుండా వినియోగదారులు దానిని ఉపయోగించిన తరువాత మైలేజ్ విషయంలో క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా ఒ కంపెనికి చెందిన కారు ఏసీ ఆన్ లో ఉంచితే 30 కిలోమీటర్ల మైలేజ్ సాధించింది. వితౌట్ ఏసీ 33 కిలోమీటర్ల మైలేజ్ సాధించింది. ఈ విషయాన్ని కంపెనీ కాకుండా ఓ వినియోగదారుడు చెప్పాడు. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?

    SUV కార్లకు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. అయితే వీటి ధరలు కాస్త ఎక్కువగా ఉండడంత మైక్రో ఎస్ యూవీ వైపు వినియోగదారులు మక్కువ చూపుతున్నారు. ఈ విషయంలో హ్యుందాయ్ కి చెందిన ఎక్స్ టర్ బెస్ట్ కారుగా నిలిచింది. హ్యుందాయ్ ఎక్స్ టర్ ను గతేడాది జూలై లో రోడ్లపైకి తీసుకొచ్చారు. ఇది 1.2 లీటర్ నేచుర్ అస్పిరేటేడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 82 బీహెచ్ పీ పవర్ తో పాటు 113 ఎన్ ఎంట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, స్మార్ట్ ఆటోమేటేడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.

    ఇందులో అడ్వాన్స్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. 40 ప్లస్ సేప్టీ ఫీచర్లు, టీపీఎంఎస్, బర్గ్ లర్ అలారం ఉంది. హెడ్ ల్యాంప్ ఎఉస్కార్ట్ ఫంక్షన్, ఆటో హెడ్ ల్యాంప్స్ ఆకర్షిస్తాయి.స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూప్ విత్ వాయిస్ కమాండ్స్, డాష్ కమ్ విత్ డ్యూయెల్ కెమెరాలు ఉన్నాయి. ఎక్స్ టర్ లో వివిధ వేరియంట్లు ఉన్నాయి. ఈఎక్స్ రూ.5.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. సీఎన్జీ వేరియంట్ రూ.8.23 లక్షల ప్రారంభ ధరతో అమ్ముతున్నారు.

    సీఎన్జీ వెర్షన్ సక్సెస్ అయినట్లు తాజాగా వెలువడిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఎక్స్ టర్ సీఎన్ జీ వెర్షన్ లో 33 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చినట్లు ఓ కారు వినియోదారుడు దీపక్ రాయ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఆయన తన కారును ప్రయాణించిన సేపు ఏసీ ఆన్ లో ఉంచుకోవడంతో 30 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చిందని అన్నాడు. అయితే ఇతనికి ఎక్స్ టర్ పెట్రోల్ వెర్షన్ కారు కూడా ఉంది. అది కేవలం 17 కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే ఇస్తుందని చెప్పాడు. దీంతో సీఎన్ జీ వెర్షన్ కు ప్రాధాన్యత పెరిగిందన్న చర్చసాగుతోంది.