Public Drinking Incident: ఇటీవల కాలంలో మద్యం తాగే వారి సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగిపోతుంది. ఒకప్పుడు కొంతమందికి మాత్రమే ఈ అలవాటు ఉండేది. ఇప్పుడు వయసుతో భేదం లేకుండా తాగడం పరిపాటిగా మారిపోయింది. కొంతమంది అయితే తాగడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటున్నారు. ఎక్కడపడితే అక్కడ కూర్చొని మద్యం తాగుతూ.. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అలా ఇబ్బంది కలిగిస్తున్న కొంతమందిని.. వద్దని వారించినందుకు ఒక వ్యక్తికి దారుణమైన అనుభవం ఎదురయింది.
Also Read: లేడీ డాన్ అరుణకు ఫైనాన్స్ చేసింది ఆ వ్యక్తే.. ఏపీలో ప్రకంపనలు
సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియో ప్రకారం.. అది పశ్చిమ బెంగాల్ నార్త్ 24 పరగనాల ప్రాంతంగా కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో కొందరు రోడ్డుపైన మద్యం తాగుతున్నారు. ఇది పద్ధతి కాదని.. ఇలా రోడ్డు మీద మద్యం తాగడం సరికాదని ఓ టీచర్ చెప్పాడు. అయితే అతను చెప్పిన మాటలు ఆ మద్యం తాగే వారికి ఇబ్బందికరంగా అనిపించాయి. ఇంకేముంది అతని మీద ముకుమ్మడిగా దానికి దిగారు. దాడి చేసిన వారిలో ఓ యువతి కూడా ఉండడం విశేషం. దీనికి సంబంధించిన సీసీ విజువల్స్ ను పోలీసులు బయటకు విడుదల చేశారు. ఆ టీచర్ పై విచక్షణారహితంగా దాడి చేసిన ఆ ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: వీళ్ళు భర్తలు కాదు.. నరరూప రాక్షసులు
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఆ ఐదుగురు మద్యం మాత్రమే కాకుండా మత్తుపదార్థాలు కూడా స్వీకరిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా చుట్టుపక్కల చాలా వరకు కుటుంబాలు నివాసం ఉంటున్న నేపథ్యంలో వారికి ఇబ్బంది కలుగుతుందని.. మద్యం వేరే ప్రాంతంలో ఉండి తాగాలని ఆ టీచర్ సూచించాడు. దానికి వారు ఒప్పుకోలేదు. పైగా మా ఇష్టం వచ్చిన చోట మేము మద్యం తాగుతాం అనడానికి నువ్వు ఎవరని ఆ ఐదుగురు ఆ టీచర్ ను ప్రశ్నించారు. పైగా రాయడానికి వీల్లేని బూతులు తిట్టారు. చివరికి అతడి మీద దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిలో ఒక యువతి కూడా ఉండడం విశేషం. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇది కాస్త ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో.. ఆ ఐదుగురుపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెలుపడ్డాయి. దీంతో పోలీస్ అధికారులు ఐదుగురిని అదుపులోకి తీసుకొని.. విచారిస్తున్నారు.
A group of individuals were openly consuming alcohol in a public area. Nirupam Pal, a drawing teacher, protested this behavior and was physically assaulted by a group of four individuals & one female. The incident occurred in Kamarhati, North 24 Parganas, Egiye Bangla, W. Bengal pic.twitter.com/s2dYJYErBj
— INTERNATIONAL HUMAN RIGHTS – INHRF (@DirectorINHRFHC) August 25, 2025