Medipally Swathi Case: ప్రేమించుకున్నప్పుడు కులం అడ్డు రాలేదు. శారీరక సుఖం అనుభవిస్తున్నప్పుడు కులం అడ్డు రాలేదు. కానీ ఎప్పుడైతే ఆమె కడుపులో నలుసు పడిందో అప్పటినుంచి కులం అడ్డు వచ్చింది. ఆ తర్వాత అతనిలో ఉన్మాదాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళింది. అప్పటికే ఒకసారి ఆమెకు గర్భ విచ్చిత్తి చేయించాడు. మరోసారి గర్భం దాల్చినపుడు కూడా విచ్చిత్తి చేయడానికి ప్రయత్నించాడు. ఈసారి ఆమె ఒప్పుకోలేదు. అప్పటిదాకా అక్కడిలో ఉన్న మనిషి స్థానంలో ఉన్మాది ప్రవేశించాడు. ఆమెను అత్యంత దారుణంగా చంపేలా చేశాడు. మేడిపల్లి లో దారుణ హత్యకు గురైన స్వాతి ఉదంతం లో అనేక సంచలన నిజాలు కనిపిస్తున్నాయి..
మహేందర్ రెడ్డి స్వాతి కుటుంబాలు ఎదురెదురుగా ఉండేవి. స్వాతి యాదవ సామాజిక వర్గానికి చెందిన యువతి. మహేందర్ రెడ్డిని వివాహం చేసుకోవడం దీపిక తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. ఆ పెళ్ళికి మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు మాత్రం హాజరయ్యారు. మొదట్లో మహేందర్ రెడ్డి తన కాపురాన్ని ఘట్కేసర్ ప్రాంతంలో పెట్టాడు. ఆ తర్వాత బోడుప్పల్ ప్రాంతానికి మార్చాడు. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా పని చేసేవాడు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదు. స్వాతి మాత్రం అందరితో కలివిడిగా ఉండేది. వీరిద్దరికి 19 నెలల క్రితమే పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే స్వాతి నెల తప్పింది. అయితే ఆమె తల్లి కావడం మహేందర్ రెడ్డి కి ఏ మాత్రం ఇష్టం లేదు. దీంతో ఆమెకు గర్భ విచ్చిత్తి చేయించాడు. అప్పట్లో ఆమె కొద్ది రోజులపాటు అనారోగ్యంతో బాధపడింది. పెళ్లి జరిగిన నాటి నుంచి స్వాతిని ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడనిచ్చేవాడు కాదు. ఆ తర్వాత ఆమె దొంగ చాటుగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేది.
ఆమె ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న దృశ్యాన్ని చూసి.. మహేందర్ రెడ్డి తీవ్రంగా కొట్టాడు. అప్పట్లో వారి ఇంట్లో వినిపించిన అరుపులు తమకు భయాందోళన కలిగించాయని చుట్టుపక్కల వారు అంటున్నారు.. అప్పటినుంచి ఆమెను నిత్యం వేధించడం.. కొట్టడాన్ని మహేందర్రెడ్డి పరిపాటిగా మార్చుకున్నాడు. ఇక ఇటీవల
స్వాతి మళ్ళీ గర్భం దాల్చింది. ఆమె గర్భం దాల్చడం మహేందర్ రెడ్డికి ఇష్టం లేకుండా పోయింది. దీంతో ఆమెకు మరోసారి గర్భ విచ్చిత్తి చేయించాలని అనుకున్నాడు. దానికి దీపిక ఒప్పుకోలేదు. మరోవైపు ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. స్వాతి గర్భవతి అని కూడా చూడకుండా మహేందర్ రెడ్డి ఇటీవల తీవ్రంగా కొట్టాడు.. ఆ గాయాలకు తట్టుకోలేక ఆమె చనిపోయింది. దీంతో ఆమె శరీర భాగాలను ప్లాస్టిక్ సంచుల్లో వేసి మూసి నదిలో పడేశాడు మహేందర్ రెడ్డి.. ఈ దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి.
Also Read: వీళ్ళు భర్తలు కాదు.. నరరూప రాక్షసులు
స్వాతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యుల్లో తాము అధిక కులం వారమనే భావన ఉండేది. అందువల్లే ఆమెను నిత్యం ఇబ్బంది పెడుతూ ఉండేవారు. కన్నవారిని ఎదిరించి వచ్చానని.. వారికి ముఖం ఎలా చూపించుకోవాలో తెలియక దీపిక ఆ బాధలు పడుతూ అలానే ఉండిపోయేది. తను ఎన్ని బాధలు పడుతున్నప్పటికీ బయటికి చెప్పు లేకపోయేది. తన తల్లిని మాత్రం బిపి మాత్రలు వేసుకోవాలని సూచించేది.. స్వాతిని కొడుతున్నప్పుడు.. తనను వదిలేయాలని మహేందర్ రెడ్డిని ప్రాధేయపడిందని.. అయినప్పటికీ అతడు వినిపించుకోలేదని.. చివరికి ఆమెను అంతం చేసి అత్యంత దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసి మూసి నదిలో పడేసాడని స్థానికులు అంటున్నారు. అతడు పోలీసులకు లొంగిపోయి అసలు విషయం చెప్పేదాకా ఈ దారుణం గురించి బయట ప్రపంచానికి తెలియదు. అయితే ఈ సంఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలాంటి ఘటనలతోనైనా యువతులు మారాలని.. ప్రేమ పేరుతో మోసం చేసే దుర్మార్గులకు దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.