Mumbai : మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే మన దేశంలో జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. గతంలో జరిగిన నిర్బయ సంఘటన తరువాత దేశంలో మహిళా చట్టాల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటోంది. ఫోక్సో చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన తరువాత మహిళలను చిన్న చూపు చూసినా, వారిని అసభ్యంగా తాకినా, వెకిలి చేష్టలు చేసినా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. నేరం రుజువు అయితే జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధిస్తున్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తి ఓ మహిళ విషయంలో అసభ్యంగా ప్రవర్తించమే కాదు. కన్ను కొట్టాడు. ఇందుకోసం అతనికి కోర్టు జరిమానా విధించింది. ఆ జరిమానా ఎంత? ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఆ వివరాల్లోకి వెళితే..
అమ్మాయిని చూడగానే ఒకప్పుడు కన్ను కొట్టడం చేస్తుండేవారు. కానీ ఇది వారికి అసభ్యాన్ని కలిగిస్తుంది. వెకిలి చేష్టల్లో దీనిని కూడా భాగం చేశారు. అమ్మాయిని చూస్తు కన్ను కొట్టడం చేస్తే పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు దానిని నేరంగానే పరిగణిస్తారు. అయితే ఒక వ్యక్తి ఇలా చేసిన తరువాత బాధితురాలు ఈ విషయాన్ని సీరియస్ తీసుకుంటనే పోలీసులు కేసు నమోదు చేస్తారు. కానీ ఇలాంటి నేరాలు ఎక్కడా పెద్దగా కనిపించవు. మన దేశంలో మహిళా చట్టాలు కఠినంగా ఉన్నా.. కొన్ని అమలులో లోపాలు ఉన్నాయని కొందరి భావన. మరోవైపు మహిళలు తాము సమస్యలు ఎదుర్కొన్నా.. ధైర్యంగా పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఫిర్యాదులు చేసేవారు తక్కువ. అందువల్ల మహిళల రక్షణ కోసం ఎలాంటి చట్టాలు ఉన్నాయో చాలా మందికి అవగాహన లేదు.
మహిళను అసభ్యంగా పదే పదే చూసినా.. వారిని చూస్తూ పిచ్చి పిచ్చి చేష్టలు చేసినా నేరమే. ఇందుకు జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుంది. అయితే ఆ నేర తీవ్రతను బట్టి జరిమానా ఉంటుంది. తాజాగా బాంబే హైకోర్టు మహ్మద్ కైఫ్ ఫకీర్ అనే వ్యక్తికి రూ. 15 వేల జరిమానా విధించింది. ఒక మహిళను పదే పదే చూస్తూ కన్ను కొట్టాడు. అంతేకాకుండా ఆమెను అసభ్యంగా తాకాడు. దీంతో ఆమె బాధపడుతూ కూర్చోకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు అయిన తరువాత కోర్టుకు వెళ్లింది.దీనిపై కోర్టు విచారణ చేపట్టి రూ. 15 వేల జరిమానా విధించింది.
అయితే దేశంలో చాలా మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొంటారు. కానీ ఎవరూ ఈ విషయాన్ని బయటపెట్టరు. కుటుంబ పరువుతో పాటు కాస్త ధైర్యం చాలకపోవడంతో చాలా మంది ఈ సమస్యను తమలోనే దాచుకుంటూ మదనపడుతున్నారు. కానీ ఈ విషయంపై కూడా పోలీసులకు ఫిర్యాదులు చేయడం వల్ల ఈ సమస్యకు అడ్డుకట్ట వేయొచ్చని కొందరు చెబుతున్నారు. ఇలాంటి వాటి విషయంలో కామ్ గా ఉండడంతో కొందరు రెచ్చిపోయి మహిళలపై దాడులు చేస్తున్నారు. ఈ దాడులతో మహిళల ప్రాణాలు పోతున్నాయి. అందువల్ల పోకిరీల విషయంలోనూ కఠినంగా ఉండడం వల్ల సమస్యను మొదట్లోనే తుంచేయవచ్చని కొందరు చెబుతున్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Bombay high court fine of rs 15000 to one person for winking an eye against a woman
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com