https://oktelugu.com/

Nellore: ఓరి వెధవ అదేం పని రా.. బాలుడి కడుపులోకి గాలి నింపాడు..

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామానికి చెందిన 12 సంవత్సరాల బాలుడు స్నేహితులతో వాలీబాల్ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆ బాల్ లో గాలి తగ్గింది.

Written By:
  • Dharma
  • , Updated On : April 26, 2024 / 03:19 PM IST

    Nellore

    Follow us on

    Nellore: ఒక్కోసారి మనం చేసే పనులు వికటిస్తాయి. మనం సరదాగానే భావించినా.. ఎదుటి వారికి అవి ఇబ్బందికరంగా మారుతాయి. తాజాగా ఓ యువకుడు చేసిన అతి.. బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రస్తుతం బాధితుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

    పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామానికి చెందిన 12 సంవత్సరాల బాలుడు స్నేహితులతో వాలీబాల్ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆ బాల్ లో గాలి తగ్గింది. దగ్గర్లో సచివాలయం వద్ద వాలీబాల్ ఆడుతున్న యువకుల వద్దకు పిల్లలు వెళ్లారు. అక్కడ తొలికొండ రాజా అనే యువకుడు బాధిత బాలుడిని పట్టుకున్నాడు. అతని వ్యవహార శైలిని చూసిన మిగతా పిల్లలు భయంతో పరుగులు తీశారు. తరువాత తన చేతికి చిక్కిన బాధిత బాలుడిని రాజా చుక్కలు చూపించాడు. వికృత చేష్టలతో రెచ్చిపోయాడు. మలద్వారం వద్ద పంపుతో బలంగా గాలి కొట్టాడు. ఎలాగోలా విడిపించుకున్న ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

    ఇంటికి వెళ్లిన బాలుడి శరీరాకృతిలో మార్పు వచ్చింది. కడుపు ఉబ్బడంతో పాటు మర్మాంగాలు వచ్చాయి. అయితే తల్లిదండ్రులకు చెబితే ఏమవుతుందోనని భయపడి చెప్పడం మానేశాడు. అయితే అర్ధరాత్రి సమయంలో నొప్పి తీవ్రం కావడంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. బిగ్గరగా రోధించడంతో తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది. జరిగిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పై ఫోక్సో కేసు పెట్టి.. దర్యాప్తు చేస్తున్నారు.