Eluru: దేశంలో కామాంధుల అకృత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఒకవైపు మహిళల రక్షణకు కఠిన చట్టాలు చేస్తున్నారు. కోర్టులు ఉరి శిక్ష విధిస్తున్నా.. మానవ మృగాల తీరు మారడంలేదు. పశువులకన్నా హీనంగా మారుతున్నారు. ఆడవాళ్లు కనిపిస్తే అనుభవించాలి అన్నట్లు చూస్తున్నారు. దీంతో దేశంలో మహిళలు ఒంటరిగా బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి. నెల క్రితం కోల్‌కతా ఆర్జికార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌ను ఓ కమాంధుడు దారుణంగా హత్య చేశాడు. దీనిపై దేశ వ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏలూరులోని ఓ అనాథాశ్రమంలో బాలికల పాలిట వార్డెన్ భర్త మానవ మృగంలా మారాడు. పక్షుల గూట్లోకి పాము చొరబడినట్లు.. వార్డెన్ భర్తగా ఆశ్రమంలోకి వచ్చిన 55 ఏళ్ల కీచకుడు బాలికలను చెరవడుతున్నాడు. ఇదే తన పనిగా పెట్టుకున్నాడు. తన కోరిక తీర్చని బాలికలను చిత్రహింసలు పెడుతున్నాడు. చాలాకాలంగా అతని దుర్మార్గాలను తట్టుకున్న బాలికలు.. ఓపిక నశించి చివరకు ఏలూరు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను కీచకుడి బారినుంచి కాపాడాలని వేడుకున్నారు. అనాథాశ్రమంలో కామాందుడి లీలలు వెలుగులోకి రావడంతో ఏలూరు నగరం ఉలిక్కిపడింది.
సేవాశ్రమం ఆధ్వర్యంలో..
ఏలూరు అమీనాపేటలో స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం ఆధ్వర్యంలో బాలికల వసతి గృహం నిర్వహిస్తున్నారు. సేవాభావంతో ఈ వసతి గృహం ఏర్పాటు చేశారు. వార్డెన్‌గా మణిశ్రీని నియమించారు. ఆమె భర్తగా హాస్టల్‌లోనే ఉంటున్న శశికుమార్ వసతి గృహంలోని బాలికలపై కొన్నాళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. సహకరించనివారిని దారుణంగా వేధిస్తున్నాడు. శివకుమార్ ఏలూరు ఎన్‌ఆర్‌పేటలో మణి ఫొటో స్టూడియో నడుపతూ మరోవైపు ఏలూరు జిల్లా యర్రగుంటపల్లి బీసీ హాస్టల్‌లో పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉన్న పరిచయాలతో తన రెండో భార్య మణిశ్రీని సేవాశ్రమంలో వార్డెన్‌గా చేర్పించాడు.
కాళ్లు చేతులు కట్టేసి..
సేవాశ్రమంలో ఉండేవారంతా పేద విద్యార్థినులు. వీరు స్థానికంగా పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్నారు. కామాంధుడైన శశికుమార్ ఆ బాలికలపై కన్నేశాడు. వార్డెన్ భర్తగా ఆశ్రమంలోకి ఎంటర్ అయ్యాడు. పదుల సంఖ్యలో బాలికలను లైంగికంగా వేధించాడు. ఇన్నాళ్లూ ఓపిక పట్టిన బాలికలు.. ఆదివారం ఓ బాలికను బాపల్లకు ఫొటో షూట్ కోసమని తీసుకెళ్లి సోమవారం రాత్రి తీసుకువచ్చాడు. ఆ బాలిక తన దుస్తులు మార్చుకుంటూ ఏడవడంతో మిగతావారు ఏం జరిగిందని ఆరా తీశారు. దీంతో బాధితురాలు జరిగిన దారునం చెప్పింది. దీంతో ఆగ్రహించిన వార్డెన్ భర్త బాధితులంతా ఏలూరు టౌన్ పోలీస్ స్టేషన్‌కు మంగళవారం వెళ్లి ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రులు, బంధువులు విషయం తెలుసుకుని స్టేషన్‌కు రావడంతో ఉద్రిక్తత నెలకొంది.