Tamil Nadu: పెళ్లయినప్పటికీ భర్తకు స్వేచ్ఛనిస్తుందట.. పైగా స్టాంప్ పేపర్ పై సంతకం చేసింది.. భార్యామణి అంటే ఈమెనేమో..

తమిళనాడు రాష్ట్రంలోని మైలాడు దురై జిల్లాలోని సీర్గాలి సమీపంలోని తెన్ పాడి కి చెందిన ముత్తుకుమార్.. కురింజి పాడికి చెందిన పవిత్రను వివాహం చేసుకున్నాడు. సోమవారం వారి వివాహ క్రతుకు అంగరంగ వైభవంగా జరిగింది.

Written By: Neelambaram, Updated On : September 18, 2024 2:27 pm

Grooms Friends Make Agreement With Bride For Husband Freedom

Follow us on

Tamil Nadu: పెళ్లంటే ఓ ప్రమాణం. ఆ ప్రమాణానికి అనుగుణంగా సాగించేదే సంసారం. ఈ సంసారానికి భార్యాభర్తలు అనేవారు ఇరుసుల్లాంటి వాళ్ళు. వారిద్దరూ ఎంత చక్కగా ప్రయాణం సాగిస్తే సంసారం అనేది అంత అన్యోన్యంగా ఉంటుంది. పొరపాటున తేడా వస్తే.. అల్లకల్లోలం అవుతుంది.

వెనుకటి రోజుల్లో భార్య అంటే భర్తకు ప్రేమ ఉండేది. భర్త అంటే భార్యకు గౌరవం ఉండేది. నేటి స్మార్ట్ కాలంలో అలాంటివన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఆర్థిక స్థిరత్వం పెరగడం.. స్వేచ్ఛ ఎక్కువ కావడం.. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడం వల్ల భార్యాభర్తల బంధం క్రమేపి బీటలు వారుతోంది. ప్రేమ, గౌరవాలు మాయమవుతున్నాయి. అందువల్లే సంసారాలు సాఫీగా సాగడం లేదు. అయితే అందరిలోనూ ఇలా ఉందా అంటే.. అందరి కాకపోయినా మెజారిటీ జంటల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే నేటి స్మార్ట్ కాలంలోనూ ఒక జంట చేసిన పని చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆ భార్యామణి తీసుకున్న నిర్ణయం సంచలనానికి కారణమవుతోంది.

తమిళనాడు రాష్ట్రంలోని మైలాడు దురై జిల్లాలోని సీర్గాలి సమీపంలోని తెన్ పాడి కి చెందిన ముత్తుకుమార్.. కురింజి పాడికి చెందిన పవిత్రను వివాహం చేసుకున్నాడు. సోమవారం వారి వివాహ క్రతుకు అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం పవిత్ర ఒక స్టాంప్ పేపర్ పై సంతకం చేసింది. దీంతో వచ్చిన బంధువులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి నోరెళ్లబెట్టారు. వివాహం జరిగిన తర్వాత ముత్తుకుమార్ తమతో కలివిడిగా ఉండలేడని.. పార్టీలకు హాజరు కాలేడని.. విందులు వినోదాల్లో పాల్గొనలేడని స్నేహితులు బాధపడ్డారు. ఇదే విషయాన్ని పవిత్రకు చెప్పారు.

సమస్యకు పరిష్కారం ఆలోచించి..

పవిత్ర ముత్తు కుమార్ స్నేహితుల సమస్య పరిష్కారానికి మార్గం ఆలోచించింది. అప్పటికప్పుడు ముత్తు కుమార్ స్నేహితులతో ఒక మాట చెప్పింది. దీంతో వంద రూపాయల స్టాంప్ పేపర్ వారు బయట కొనుగోలు చేసి కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆ తర్వాత తన తన స్వ దస్తూరి తో పవిత్ర స్టాంప్ పేపర్ పై సంతకం పెట్టింది. దానికంటే ముందు ” నా భర్త స్వేచ్ఛ విషయంలో నేను కలగజేసుకోను. స్నేహితులతో బయటకు వెళ్లాల్సివస్తే ఆయనకు అడ్డు చెప్పను. వారితో విహారయాత్రలకు వెళ్తున్నప్పుడు సమ్మతిస్తానని” పవిత్ర స్టాంపు పేపర్ పై రాసింది. ఆ తర్వాత ఆమె సంతకం పెట్టింది. పవిత్ర చేసిన పని సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ముత్తు కుమార్ స్నేహితుల్లో సానుకూల దృక్పథం పెరగడానికి కారణమైంది. పవిత్ర చేసిన పని పట్ల ముత్తుకుమార్ హర్షం వ్యక్తం చేశాడు. తన సతీమణి నిజంగా భార్యామణి అని వ్యాఖ్యానించాడు. స్టాంపు పేపర్ పై పవిత్ర సంతకం చేసిన అనంతరం ముత్తు కుమార్ స్నేహితులు గట్టిగా కేరింతలు కొట్టడం విశేషం . ముత్తుకుమార్ కు పెళ్లి కాకముందు తన స్నేహితులతో కలివిడిగా ఉండేవాడు. వారితో విహారయాత్రలకు వెళ్లేవాడు. విందులు వినోదాలలో మునిగి తేలేవాడు. పెళ్లి చేసుకున్న తర్వాత తమతో గతంలో మాదిరిగా ఉండలేడని అతడి స్నేహితులు వాపోవడంతో.. పవిత్ర ఈ నిర్ణయం తీసుకుంది.