Nizamabad: ఛీ.. ఛీ.. ఈమెను తల్లి అంటారా? ఏ తల్లైనా ఇలా చేస్తుందా?

నిజామాబాద్ లోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతానికి చెందిన రమ్య( పేరు మార్చాం) అనే మహిళకు గతంలో పెళ్లయింది. ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. రమ్య తన భర్తతో తరచూ వివాదాలకు పాల్పడుతుండడంతో.. తట్టుకోలేక భర్త విడాకులు ఇచ్చాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 26, 2024 6:04 pm

Nizamabad:

Follow us on

Nizamabad: ఈ భూమ్మీద తల్లిని మించిన దైవం లేదు. తల్లిలాగా ప్రేమించే వ్యక్తి ఉండరు. అందుకే మాతృదేవోభవ అంటారు. అయితే ఈ తల్లి మాత్రం మాతృత్వానికి మచ్చ తెచ్చింది. కన్న కూతురిపై పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రవర్తించింది. ఇంతకీ ఏం చేసిందంటే..

నిజామాబాద్ లోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతానికి చెందిన రమ్య( పేరు మార్చాం) అనే మహిళకు గతంలో పెళ్లయింది. ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. రమ్య తన భర్తతో తరచూ వివాదాలకు పాల్పడుతుండడంతో.. తట్టుకోలేక భర్త విడాకులు ఇచ్చాడు. ప్రస్తుతం ఆమె తన కుమార్తె, కుమారుడితో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు అల్తాఫ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న మైనర్ కూతుర్ని పక్కకు తప్పించాలని రమ్య, అల్తాఫ్ భావించారు. ఈ క్రమంలో అల్తాఫ్ చెప్పిన ఓ ప్రణాళికకు రమ్య ఓకే చెప్పింది. తన కూతుర్ని తీసుకొని ఠాణా కలాన్, జానకంపేట శివారులోని నిజాంసాగర్ కెనాల్ వద్ద ఉన్న మల్లన్న గుడి సమీపంలోని అడవికి తీసుకెళ్లారు.. ఆ సమయంలో అల్తాఫ్ స్నేహితుడు ఆరిఫ్ కూడా వారితో వచ్చాడు. ఆ ముగ్గురు కలిసి ఆ బాలికను తీవ్రంగా గాయపరిచారు. ఆమె ఏడుస్తున్నప్పటికీ కనికరం లేకుండా వ్యవహరించారు. ఆ తర్వాత ఉరివేశారు.

ఆ బాలిక చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం ఆ ప్రాంతం మీదుగా వెళుతున్న స్థానికులకు తీవ్రంగా గాయపడిన బాలిక కనిపించింది. దీంతో వెంటనే ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ బాలిక ప్రస్తుతం అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతోంది. బాలిక స్పృహలోకి వచ్చిన తర్వాత.. ఆమె కీలక విషయాలు చెప్పడంతో.. రమ్య అల్తాఫ్ తో సాగించిన వివాహేతర సంబంధం, ఆ బాలికను చంపేందుకు రూపొందించిన ప్రణాళికలు తెరపైకి వచ్చాయి.. ” మా అమ్మ మా నాన్నతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత అల్తాఫ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారి సంబంధానికి అడ్డుగా ఉన్నానని భావించి నన్ను చంపేందుకు ప్రయత్నించారు. నాకు మాయమాటలు చెప్పి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. అటవీ ప్రాంతంలోనే నాకు ఉరివేశారు. నేను చనిపోయానని భావించి వెళ్లిపోయారని” ఆ బాలిక చెప్పింది. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం పోలీసులు రమ్య, అల్తాఫ్, ఆరిఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. బాలిక తమ్ముడిని పోలీసులు సదరం హోం కు తరలించారు.