Kubera 4 Days Collections : రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన శేఖర్ కమ్ముల(Sekhar Kammula) కుబేర(Kuberaa Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంటూ బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తుంది. తెలుగు, తమిళ భాషలకు కలిపి ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 65 కోట్ల రూపాయలకు జరిగింది. నాలుగు రోజుల్లో 45 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. మరో 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడితే ఈ చిత్రం కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్నట్టే. అయితే తెలుగు వెర్షన్ లో వస్తున్నంత వసూళ్లు తమిళ వెర్షన్ లో రావడం లేదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే తమిళం లో ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు.
తమిళనాడు ప్రాంతానికి గాను ఈ చిత్రం 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. అంటే ఆ ఒక్క ప్రాంతం నుండే కనీసం 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. కానీ నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి ఆ ప్రాంతం నుండి వచ్చిన వసూళ్లు కేవలం 14 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే. ఫుల్ రన్ లో ఎంత గింజుకున్నా 30 కోట్ల రూపాయలకు మించి గ్రాస్ వసూళ్లు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇదే ట్రేడ్ ని ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఓవరాల్ గా ఈ చిత్రానికి నాల్గవ రోజున ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు,5 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల నుండి నిన్న ఒక్క రోజున 3 కోట్ల 12 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా నాలుగు రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 24 కోట్ల 93 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 42 కోట్ల 65 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇదే రేంజ్ స్టడీ రన్ ని మరో రెండు వారాలు కొనసాగిస్తే కేవలం తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ ని రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే విధంగా కేరళలో నాలుగు రోజులకు కలిపి కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఓవర్సీస్ నుండి 23 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, కర్ణాటక నుండి 6 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రం నాలుగు రోజులకు గాను 90 కోట్ల రూపాయిల గ్రాస్, 45 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈరోజు, లేదా రేపు ఈ చిత్రం ప్రతిష్టాత్మక వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకోనుంది.