https://oktelugu.com/

Amazon Prime Video : ప్రైమ్ యూజర్స్ కి బంపర్ ఆఫర్.. ఇండియాకు మరో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ తెస్తున్న డిజిటల్ దిగ్గజం!

ఇండియాలో అమెజాన్ ప్రైమ్ చందాదారుల సంఖ్య 2.1 కోట్లు అని సమాచారం. హాట్ స్టార్ ని బీట్ చేయాలని అమెజాన్ చాలా కాలంగా ట్రై చేస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 1, 2024 / 09:22 PM IST

    Amazon Prime Video, MGM+

    Follow us on

    Amazon Prime Video : ఇండియాలో అత్యధిక సబ్స్క్రైబర్స్ ఉన్న డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో అమెజాన్ ప్రైమ్ ఒకటి. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు ఇంటర్నేషనల్ కంటెంట్ అందిస్తూ టాప్ లో దూసుకుపోతుంది. కాగా ప్రైమ్ చందాదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది సంస్థ. ప్రైమ్ కి అనుబంధంగా మరో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ఇండియాకు తెచ్చింది. MGM+ పేరుతో ఈ డిజిటల్ ఛానల్ అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయంగా అమెజాన్ ప్రైమ్ 20 డిజిటల్ ఛానల్స్ అనుబంధంగా అందిస్తుంది. ప్రైమ్ చందాదారులు కేవలం సంవత్సరానికి రూ. 599 చెల్లించి MGM+ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.

    అమెజాన్ సబ్స్క్రిప్షన్ చార్జెస్ తో పోల్చితే ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. MGM+ ఆల్రెడీ ఇండియాలో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తుండగా అద్భుతమైన అంతర్జాతీయ కంటెంట్ కలిగి ఉంది. MGM+ హాలీవుడ్ మూవీస్, టీవీ షోస్ తో పాటు భిన్న రకాల జోనర్స్ తో కూడిన ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. స్టార్ గేట్ ఎస్ జి 1, స్టార్ గేట్ అట్లాంటిస్, టీన్ వోల్ఫ్ అండ్ గెట్ వంటి సిరీస్లతో పాటు లీగల్లీ బ్లోండ్, హెర్క్యులస్, ది ప్రాడిజీ, ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్, ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ, రోబోకాప్, ది వోవ్, చైల్డ్స్ ప్లే వంటి సూపర్ హిట్ చిత్రాలు చూడొచ్చు.

    ప్రైమ్ వీడియో వీడియో ఛానల్స్, ప్రైమ్ వీడియో ఇండియా హెడ్ వివేక్ శ్రీవాత్సవ మాట్లాడుతూ… MGM+ ని ఇండియాలో లాంచ్ చేస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాము. ప్రైమ్ అనుబంధ ఛానెల్స్ తేవడం ద్వారా ఇండియన్ ఆడియన్స్ కి డిఫరెంట్ జోనర్స్ తో కూడిన కంటెంట్ ఒకే చోట చూసేలా ప్రేక్షకులకు వెసులుబాటు కలిగించగలుతున్నాము. మీరు కోరుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్, సిరీస్ ప్రైమ్ వీడియో, MGM+ ఛానెల్స్ లో చూడొచ్చని… అన్నారు.

    ప్రైమ్ వీడియో ఛానల్ లేదా ప్రైమ్ యాప్ ద్వారా MGM+ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చని ప్రతినిధులు తెలియజేశారు. చూస్తుంటే ప్రైమ్ మార్కెట్ లీడర్ గా ఎదిగేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో హాట్ స్టార్ ఇండియా లో ఆధిపత్యం చూపిస్తుంది. 2024 లెక్కల ప్రకారం హాట్ స్టార్ దాదాపు 4.9 కోట్ల చందాదారులు కలిగి ఉంది. తర్వాతి స్థానంలో 2.5 కోట్ల చందాదారులతో జియో సినిమా ఉంది. మూడవ స్థానంలో అమెజాన్ ప్రైమ్ నిలిచింది. ఇండియాలో అమెజాన్ ప్రైమ్ చందాదారుల సంఖ్య 2.1 కోట్లు అని సమాచారం. హాట్ స్టార్ ని బీట్ చేయాలని అమెజాన్ చాలా కాలంగా ట్రై చేస్తుంది.