https://oktelugu.com/

Guwahati : అమ్మ అస్థిపంజరానికి పూజలు చేసి.. ఆహారం తినిపించేవాడు.. మనసును కదిలించే కథ

మృతదేహం అస్థిపంజరంలా మారిపోయింది. దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు ఆ వ్యక్తితో మాట్లాడాలని అనుకున్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : October 24, 2024 / 01:47 PM IST

    Mother's skeleton

    Follow us on

    Guwahati : అసోంలోని గౌహతిలో ఒక షాకింగ్, మనసులను కలిచివేసే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది విన్నవారి వెన్నులో వణుకు పుట్టించింది. ఓ వ్యక్తి గత మూడు నెలలుగా తన తల్లి అస్థిపంజరంతోనే నివసిస్తున్నాడు. అతను ప్రతిరోజూ తన చేతులతో అస్థిపంజరానికి ఆహారం ఇవ్వడానికి కూడా ప్రయత్నించాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ వ్యక్తి తనను తాను చాలా కాలం పాటు గదిలో బంధించి ఉంచుకున్నాడు. అతను బయటకు వెళ్లలేదు.. అదే సమయంలో ఎవరినీ తన ఇంట్లోకి అనుమతించలేదు. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికీ కొంచెం కూడా తెలీదు. తల్లి చనిపోయింది. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టాడు ఆమె కొడుకు. ఇలా నెలల తరబడి ఉండిపోవడంతో.. మృతదేహం అస్థిపంజరంలా మారిపోయింది. దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు ఆ వ్యక్తితో మాట్లాడాలని అనుకున్నారు. వారు చాలా రోజులుగా ఆ వ్యక్తి తల్లిని కూడా వారు చూడలేదు. దీంతో వారి మనసులో సందేహం మొదలైంది. కొంతమంది ఇరుగుపొరుగు వారు అతని ఇంటికి చేరుకున్నారు. మీ అమ్మ ఎక్కడ అని ప్రశ్నించారు. ఆ వ్యక్తి ఆమె చనిపోయిందని చెప్పడంతో.. విన్న ఇరుగుపొరుగు వారు షాక్‌కు గురయ్యారు. ఎందుకు తన తల్లి చనిపోయిన విషయం ఎవరికీ చెప్పలేదు. మృతదేహాన్ని ఎప్పుడు దహనం చేశారు? అని మరో ప్రశ్న అడుగగా దీనికి ఆ యువకుడు సమాధానం చెప్పకపోవడంతో తలుపులు వేసి లోపలికి వెళ్లారు.

    ఇరుగుపొరుగు వారు అక్కడ ఓ గది కిటికీలోంచి చూడగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ వ్యక్తి అస్థిపంజరానికి ఆహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తి ఇంట్లో సోదా చేయగా అస్థిపంజరం కనిపించింది. ఈ అస్థిపంజరం యువకుడి తల్లిదేనని తేలింది. వెంటనే పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడు మానసికంగా బలహీనంగా ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. ఎందుకు ఇలా చేశాడో తర్వాత తేలనుంది. ప్రస్తుతం యువకుడికి వైద్య పరీక్షలు చేశారు. అలాగే మృతురాలి బంధువులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతుంది.

    భర్త పెన్షన్‌తో ఇంటి నిర్వహణ
    ఈ ఘటన గౌహతిలోని రాబిన్సన్ స్ట్రీట్‌లో చోటుచేసుకుంది. పూర్ణిమా దేవి అనే మహిళ తన 40 ఏళ్ల కుమారుడు జైదీప్ దేవ్‌తో కలిసి ఇక్కడ నివసించింది. భర్త చనిపోవడంతో పింఛన్‌తోనే కుటుంబం గడుపుతోంది. తల్లీ కొడుకులు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదని ఇరుగు పొరుగువారు చెబుతున్నారు. ఇద్దరూ తమలో తామే మాట్లాడుకునే వారట. కొద్దిరోజులుగా మహిళ కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. అంతేకాకుండా మహిళ ఇంటి నుంచి దుర్వాసన కూడా రావడంతో.. ఆ తర్వాత ఇరుగుపొరుగువారు జైదీప్‌ని తల్లి గురించి ప్రశ్నించగా.. అతను సరైన సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో ఇరుగుపొరుగు వారు కిటికీలోంచి లోపలికి చూశారు.

    తల్లిని బతికించాలనుకున్నాడు
    జైదీప్ అస్థిపంజరానికి ఆహారం తినిపించడం ఇరుగుపొరుగు వారు చూశారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. యువకుడి మానసిక పరిస్థితి బాగా లేదని విచారణలో తేలింది. అతడి తల్లి ఎలా చనిపోయిందనే దానిపై ఆరా తీస్తున్నారు. విచారణలో జైదీప్ తన తల్లి అస్థిపంజరాన్ని తిరిగి సజీవంగా తీసుకురావడానికి పూజించేవాడని చెప్పాడు. ఏదో ఒక రోజు తను కచ్చితంగా బతికి వస్తుందని అతడు ఖచ్చితంగా నమ్మాడని దీనిని బట్టి అర్థం అవుతుంది.