Jani Master: బిగ్ బ్రేకింగ్ : జానీ మాస్టర్ కేసులో కోర్టు సంచలన తీర్పు..అభిమానులకు బిగ్ షాక్!

వాస్తవానికి ఆయనకు ఇంతకు ముందే నాలుగు రోజుల పాటు బెయిల్ మంజూరు అయ్యింది. నేషనల్ అవార్డు ని తీసుకోవడం కోసం ఢిల్లీ వెళ్లాల్సిందిగా ఆయన కోర్టుని అనుమతి కోరుతూ బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నాడు. కానీ నేషనల్ అవార్డు రద్దు అవ్వడంతో బెయిల్ అక్కర్లేదని జానీ మాస్టర్ నిరాకరించాడు.

Written By: Vicky, Updated On : October 24, 2024 2:03 pm

Jani Master(3)

Follow us on

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు లో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయనపై ‘పోస్కో’ చట్టం క్రింద కేసు ని నమోదు చేసారు. ఈ కారణంగా ఆయనకీ రావాల్సిన నేషనల్ అవార్డుని కూడా రద్దు అయ్యింది. అయితే రీసెంట్ గానే ఆయన మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. గత కొద్దిరోజులుగా బెయిల్ పిటీషన్ పై విచారణ చేపట్టిన హై కోర్టు నేడు ఆయనకి మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ నాంపల్లి హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఆయనకు ఇంతకు ముందే నాలుగు రోజుల పాటు బెయిల్ మంజూరు అయ్యింది. నేషనల్ అవార్డు ని తీసుకోవడం కోసం ఢిల్లీ వెళ్లాల్సిందిగా ఆయన కోర్టుని అనుమతి కోరుతూ బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నాడు. కానీ నేషనల్ అవార్డు రద్దు అవ్వడంతో బెయిల్ అక్కర్లేదని జానీ మాస్టర్ నిరాకరించాడు.

కానీ ఇప్పుడు మాత్రం ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు అయ్యింది. అయితే ఎన్ని రోజులు గడువు అనేది తెలియాల్సి ఉంది. అయితే బయటకి వచ్చిన తర్వాత జానీ మాస్టర్ ఎలాంటి మీడియా సమావేశాల్లో పాల్గొనకూడదు, అలాగే కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళకూడదు. ఈ రెండిట్లో ఏది పాటించకపోయిన ఆయన బెయిల్ రద్దు అవుతుంది. సాధారణంగా పోస్కో చట్టం క్రింద నేరం చేసినట్టు రుజువు అయితే నాన్ బెయిల్ వారంట్ వస్తుంది. కానీ జానీ మాస్టర్ నేరం చేసినట్టు రుజువు కాలేదు. ఆయన కేవలం రిమాండ్ లో మాత్రమే ఉన్నాడు. అందుకే హై కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరి జానీ మాస్టర్ బయటకి వచ్చిన తర్వాత ఏమి చేయబోతున్నాడు ..?, ఒప్పుకున్నా సినిమాలను పూర్తి చేస్తాడా..?, ఇంతకు ముందు లాగా ఈయనకి అవకాశాలు ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు ముందుకు వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఎంతైనా ఒక మైనర్ బాలిక పై అత్యాచారం చేసాడు అనే ఆరోపణలు ఉన్నందున, జానీ మాస్టర్ తో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపించరు.

ఆయన నిజంగా తప్పు పని చేసాడో లేదో తెలియని కానీ, ఒక్క అమ్మాయితో పెట్టుకున్నందుకు ఆయన జీవితమే సర్వ నాశనం అయ్యింది అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు జానీ తన నిజాయితీ ని నిరూపించుకుంటే కచ్చితంగా ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బెయిల్ మీద బయటకి వచ్చిన ఆయన తనని తానూ నిరూపించుకోవడానికి సాక్ష్యాలు సంపాదించి పోలీసులకు అందచేస్తాడా లేదా అనేది చూడాలి. మరోపక్క జానీ మాస్టర్ కి బహిరంగంగా మద్దతు తెలిపేవాళ్లు చాలా మంది ఉన్నారు. నేరం రుజువు కాకముందే ఆయనకీ నేషనల్ అవార్డు రద్దు చేయడం సరికాదు అంటూ కొంతమంది కొరియోగ్రాఫర్స్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పుకొచ్చారు. మరి బయటకి వచ్చిన తర్వాత ఆయనని వీళ్లంతా కాలుస్తారో లేదో చూడాలి.