Ind Vs Nz 2nd Test: సర్ఫరాజ్ వాదన.. ఆశ్చర్యపోయిన రోహిత్.. రివ్యూ లో టీమిండియా కు ఊహించని ఫలితం.. వీడియో వైరల్

పూణే వేదికగా న్యూజిలాండ్ జట్టుతో టీమ్ ఇండియా రెండవ టెస్ట్ ఆడుతోంది. బెంగళూరులో జరిగిన తొలి టెస్ట్ లో ఓటమి నేపథ్యంలో.. రెండవ టెస్టులో టీమిండియా అనేకమార్పులు చేసింది. జట్టులోకి గిల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్ కు అవకాశం ఇచ్చింది. కెల్ రాహుల్, కులదీప్ యాదవ్, సిరాజ్ ను రిజర్వ్ బెంచ్ కు పర్మితం చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 24, 2024 1:44 pm

Ind Vs Nz 2nd Test

Follow us on

Ind Vs Nz 2nd Test: ఈ టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సమయంలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.. షార్ట్ లెగ్ లోన్ సర్ఫరాజ్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అశ్విన్ వేసిన బంతిని న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగ్ ఆడబోయి కీపర్ పంత్ చేతికి చిక్కాడు. అయితే భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ ఎంపైర్ నాట్ అవుట్ అని ప్రకటించాడు. వాస్తవానికి ఈ క్యాచ్ అందుకున్న రిషబ్ పంత్ కూడా పెద్దగా నమ్మకంతో లేడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ అస్పష్టమైన వైఖరితోనే ఉన్నాడు. ఆ క్రమంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ రోహిత్ శర్మను బలవంతంగా ఒప్పించాడు. ఫలితంగా రోహిత్ శర్మ థర్డ్ అంపైర్ రివ్యూ కి వెళ్ళాడు. ఆ బంతి యంగ్ గ్లవ్స్ ను తాకినట్టు స్పష్టంగా తెలియడంతో.. థర్డ్ ఎంపైర్ హౌటు ఇచ్చాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 24 ఓవర్ చివరి బంతికి ఈ సంఘటన జరిగింది. ఆ బంతిని రవిచంద్రన్ అశ్విన్ లెగ్ సైడ్ దిశగా వేశాడు. దాన్ని అంచనా వేయలేక యంగ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అది కాస్త గ్లవ్స్ ను తాకింది. ఆ బంతి కీపర్ రిషబ్ పంత్ చేతుల్లోకి వెళ్లిపోయింది.

రోహిత్ ను ఒప్పించిన సర్ఫ రాజ్

యంగ్ గ్లవ్స్ తాకుతూ వచ్చిన బంతిని కీపర్ పంత్ అందుకున్నాడు. అయితే అతడు ఆ బంతి యంగ్ గ్లవ్స్ ను తాకిన విషయాన్ని పసిగట్ట లేకపోయాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫ రాజ్ మాత్రం పసిగట్టాడు. వెంటనే థర్డ్ అంపైర్ అప్పీల్ కు వెళ్లాడు. దానికంటే ముందు మైదానంలో ఉన్న రోహిత్ శర్మను, ఇతర ఆటగాలను బలవంతంగా ఒప్పించాడు..” నేను చూశాను. ఆ బంతి అతడి గ్లవ్స్ ను తాకూతూ వెళ్ళింది. నన్ను నమ్మండి. కచ్చితంగా అది మనకు అనుకూలమైన ఫలితం వస్తుందని” సర్ఫరాజ్ టీమిండియా ఆటగాళ్లతో అన్నాడు. కాగా, సర్ఫ రాజ్ చాకచక్యం వల్ల టీమిండియా కు వికెట్ దక్కడంతో కామెంట్రీ బాక్స్ లో ఉన్న దినేష్ కార్తీక్ అతడి సునిశిత పరిశీలనను అభినందించాడు. యంగ్ వికెట్ దక్కడానికి సర్ఫ రాజ్ కీలక పాత్ర పోషించాడని అభివర్ణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని కూడా సర్ఫరాజ్ ఒప్పించడం గొప్ప విషయం అని పేర్కొన్నాడు. కాగా, హస్తం న్యూజిలాండ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. క్రీజ్ లో కాన్వే(71), రచిన్ రవీంద్ర (18) ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.