https://oktelugu.com/

SEBI New Rule: సెబీ కొత్త రూల్: ఇక ఆ పనులకు పాల్పడితే భారీ రికవరీ తప్పదు..

సెబీ తన ఉద్యోగుల సేవలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఉద్యోగులు అవినీతి, అక్రమాలకు పాల్పడితే జరిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసేందుకు సంబంధిత ఉద్యోగుల నుంచి మొత్తాన్ని నేరుగా తిరిగి తీసుకుంటుంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : May 12, 2024 / 03:38 PM IST

    SEBI New Rule

    Follow us on

    SEBI New Rule: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో అవినీతి, అక్రమలు కూడా రోజు రోజుకు పెరగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో సెక్యురిటీస్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కూడా తన నిబంధనల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా మార్కెట్ రెగ్యులేటర్ అథారిటీ మరో కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. దీని కింద, సదరు కంపెనీ యజమాని వారి ఉద్యోగుల అవినీతి కార్యకలాపాలను నియంత్రించవచ్చని సెబీ తలిపింది. అవినీతి మూలంగా నష్టపోయిన మొత్తాన్ని రికవరీ చేయవచ్చని పేర్కొంది.

    సెబీ తన ఉద్యోగుల సేవలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఉద్యోగులు అవినీతి, అక్రమాలకు పాల్పడితే జరిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసేందుకు సంబంధిత ఉద్యోగుల నుంచి మొత్తాన్ని నేరుగా తిరిగి తీసుకుంటుంది. ఈ రికవరీని ఉద్యోగుల వేతనం, వారు అందుకున్న ఇతర మొత్తాల నుంచి లాక్కుంటుంది.

    సెబీ ఈ చర్యలకు ఎప్పుడు పూనుకుంటుంది?
    ఉద్యోగి అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు SEBI ఈ రూల్ ను ప్రయోగిస్తుంది. లేదా ఒక ఉద్యోగి అక్రమ ప్రయోజనాల కోసం అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తే ఆ పరిస్థితిలో, ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసేందుకు SEBI (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) వేతనం, ఇతర మొత్తాల నుంచి రికవరీ చేసుకుంటుంది.

    అవినీతి, అక్రమాలకు పాల్పడితే విధుల్లో ఉన్నవారిపైనే కాకుండా రిటైర్డ్ ఉద్యోగులపై కూడా ఈ రూల్ ను ప్రయోగిస్తామని సెబీ మే 6 న జారీ చేసిన నోటిఫికేషన్ లో వివరించింది. రిటైర్డ్ ఉద్యోగిపై ఈ చర్య తీసుకుంటే, పెండింగ్ వ్యవధిలో సంబంధిత ఉద్యోగి అందుకున్న గ్రాట్యుటీ పూర్తిగా.. లేదంటే పాక్షికంగా నిలిపివేయవచ్చు.

    సెబీ కొత్త నిబంధన ప్రకారం.. పెట్టిబడి సలహాదారుడు తమ ఉనికి గురించి ఏడాదికి రెండు సార్లు సోషల్ మీడియాలో సవివరంగా సమాచారం ఇవ్వాలి. వారు ఈ సమాచారాన్ని సెబీ నియమించిన పర్యవేక్షక సంస్థకు అందించాలి. ఇది పెట్టుబడి సలహాదారులపై నిఘా ఉంచే అవకాశం కల్పిస్తుంది.

    ఈ కొత్త రూల్ తో మార్కెట్ లో మోసాలను అరికట్టవచ్చని సెబీ స్పష్టం చేస్తుంది. గతంలో కంటే మార్కెట్ లో పారదర్శకత పెంచేందుకు ఈ రూల్ ను తెచ్చినట్లు సెబీ చెప్పింది.