https://oktelugu.com/

Cyber Frauds: పోలీసుకే కాల్‌ చేశాడు.. డబ్బులు డిమాండ్ చేశారు.. అడ్డంగా బుక్కయ్యాడు.. కేరళ పోలీసులకు చిక్కిన సైబర్‌ కేటుగాడు

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. సైబర్‌ నేరాలూ పెరుగుతున్నాయి. సైబర్‌ మోసాల నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటుంటే.. దొంగలు కూడా తెలివి మీరిపోతున్నారు.

Written By: Raj Shekar, Updated On : November 16, 2024 12:00 pm
Cyber Frauds

Cyber Frauds

Follow us on

Cyber Frauds: సైబర్‌ మోసాలు ఇటీవలి కాలంలో సాధారణం అయ్యాయి. ప్రజలు ఇలాంటి మోసాల బారిన పడకుండా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా నిరక్షరాస్యులతోపాటు చదువుకున్నవారు కూడా సైబర్‌ వలకు చిక్కి విలవిలలాడుతున్నారు. లక్షలు పోగొట్టుకుంటున్నారు. మొదట ఏటీంఎ కార్డులు, క్రెడిట్‌ కార్డులు హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు.. పార్ట్‌ టైం జాబ్స్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇక కొందరికి గిఫ్ట్‌లు వచ్చాయని, కేవైసీ అప్‌డేట్‌ అని ఫోన్‌ చేసి మోసాలు చేస్తున్నారు. కొందరి ఆన్‌లైన్‌ ట్రాన్‌జాక్షన్స్‌ హ్యాక్‌ చేసి మనకు తెలియకుండానే ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఇక ఇప్పుడు పోలీసుల పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేరళలో ఓ సైబర్‌ నేరగాడు.. ఏకంగా పోలీస్‌కే ఫోన్‌ చేసి అడ్డంగా దొరికిపోయాడు.

ఏం జరిగిందంటే…
కేరళ రాష్ట్రానికి చెందిన ఓ సైబర్‌ నేరగాడు శుక్రవారం(నవంబర్‌ 15న) వీడియో కాల్‌ చేశాడు. అతను కూడా పోలీస్‌ యూనిఫాం వేసుకునే ఉన్నాడు. త్రిస్సూర్‌ సైబర్‌ సెల్‌ పోలీసుకు ఫోన్‌ చేసి బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన ఆ పోలీస్‌.. వెంటనే.. తన ఫోన్‌ కెమెరా సరిగా పని చేయడం లేదని బుకాయించాడు. ఈ క్రమంలో నిందితుడి ఫొటో, అతడు ఎక్కడి నుంచి ఫోన్‌ చేస్తున్నాడు.. అనేవి ట్రాపన్‌ చేశారు. అయితే సదరు సైబర్‌ నేరగాడు.. తాను హైదరాఆద్‌ సైబర్‌ సెల్‌ నుంచి ఫోన్‌చేస్తున్నానని దబాయించాడు. దీంతో కేరళ పోలీస్‌ అలర్ట్‌ అయి.. తాను సైబర్‌ పోలీస్‌ అని చెప్పడంలో అవతలి వ్యక్తి షాక్‌ అయ్యాడు. అంతేకాదు.. నీ వివరాలు మొత్తం ట్రాప్‌ చేశామని చెప్పాడు. ఇక నీ పని అయిపోయింది. నీ పని మానుకో.. నీ అడ్రస్‌ దొరికింది అని తెలిపాడు. దీంతో సైబర్‌ నేరగాడు షాక్‌ అయ్యాడు.

వీడియో ఎక్స్‌లో..
ఇక కేరళ పోలీసులు ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. సైబర్‌ నేరగాళ్లు ఎంతకు గెలిస్తున్నారో జననికి తెలియజేయాలని ఎక్స్‌లో పోస్టు చేశారు. నేరస్తుడిని ఎలా పట్టుకున్నామో అందులో వివరించారు. ప్రజలు సైబర్‌ మోసాలపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కేరళ పోలీసులకు థ్యాంక్స్‌ చేసుతున్నారు. వారు చేసిన పనిని అభినందిస్తున్నారు.