https://oktelugu.com/

Ramamurthy Naidu: సీఎం చంద్రబాబు సోదరుడి పరిస్థితి విషమం.. హైదరాబాద్ కు లోకేష్

చిత్తూరు రాజకీయాల్లో నారా కుటుంబానిది ప్రత్యేక స్థానం. 1978 నుంచి తనదైన ముద్ర వేస్తూ వచ్చారు చంద్రబాబు. మధ్యలో సోదరుడు రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ అనారోగ్యంతో రాజకీయాలకు దూరమయ్యారు.

Written By: Dharma, Updated On : November 16, 2024 12:05 pm
Ramamurthy Naidu

Ramamurthy Naidu

Follow us on

Ramamurthy Naidu: ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు పరిస్థితి విషమంగా ఉంది.గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆయన పరిస్థితి విషమంగా మారినట్లు తెలుస్తోంది.దీంతో చంద్రబాబు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మంత్రి లోకేష్ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకొని హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ టూర్ లో ఉన్నారు. నిన్ననే ఆయన ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. ఈరోజు ఆయన మహారాష్ట్ర రానున్నారు.అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సరిగ్గా ఇదే సమయంలో సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విశమంగా మారినట్లు తెలుస్తోంది.గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రామ్మూర్తి నాయుడు. ప్రస్తుతం హైదరాబాదులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మంత్రి లోకేష్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తున్నారు.

* చంద్రగిరి ఎమ్మెల్యేగా
రామ్మూర్తి నాయుడు స్వయానా చంద్రబాబు సోదరుడు. 1994లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1999 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు నారా రోహిత్. మరొకరు గిరీష్. సినీ నటుడుగా ఉన్న నారా రోహిత్ నిశ్చితార్థ వేడుకలు కొద్దిరోజులు కిందట జరిగాయి. రోహిత్ పెద్దమ్మ నారా భువనేశ్వరి దగ్గరుండి ఈ నిశ్చితార్థ వేడుకలు జరిపారు.త్వరలోనే వివాహ వేడుకలకు నిర్ణయించారు.ఇంతలోనే రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం క్షీణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

* సినీ నటుడిగా కుమారుడు
1999 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు రామ్మూర్తి నాయుడు.అయితేసోదరుడిని పక్కకు తప్పించాలని చంద్రబాబుపై తరచూ విమర్శలు చేసేవారు వైసిపి నేతలు.దీనిని రామ్మూర్తి నాయుడు కుమారుడు రోహిత్ ఖండించారు. పెదనాన్న క్రమశిక్షణ గల వ్యక్తి అని.. ఆయనపై విమర్శలు మానుకోవాలని.. తమ కుటుంబాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారని గుర్తు చేశారు. అయితే ఎన్నికల్లో నారా రోహిత్ కూటమి తరుపున చాలా నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు.ముఖ్యంగా సోదరుడు నారా లోకేష్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. మొన్న రోహిత్ నిశ్చితార్థ వేడుకలను నారా భువనేశ్వరి,లోకేష్, బ్రాహ్మణీలు దగ్గరుండి చూసుకోవడం విశేషం.