Annamayya District: నాన్నా.. నిద్ర లే.. బుజ్జీ.. మన ఇంటికి వెళ్దాం పదా.. అయ్యో భగవంతుడా.. ఈ తల్లి కష్టం ఎవరికీ రావద్దు.

నవమాసాలు మోసింది. కడుపులో తంతుంటే ఓర్పుగా భరించింది. అతడు పుట్టిన తర్వాత.. అతడే లోకంగా బతికింది. తన చను బాలను ప్రేమతో ఇచ్చింది. గోల చేస్తే తట్టుకుంది. ఉగ్గుపెట్టి... తన రూపాన్ని అతడిలో చూసుకుంది. కానీ ఆ తల్లికి చివరికి కడుపు శోకం మిగిలింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 8, 2024 5:23 pm

Annamayya District

Follow us on

Annamayya District:  ఆ బాలుడి వయసు ఐదు సంవత్సరాలు. వచ్చిరాని మాటలతో ఇళ్ళంతా సందడి చేస్తుంటాడు. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చదువుతున్నాడు. అతడి అల్లరిని తల్లిదండ్రులు ఆనందంగా భరిస్తుంటారు. ఉత్సాహానికి ప్రతీకలాగా ఉండే ఆ బాలుడంటే ఇరుగుపొరుగు వారికి చాలా ఇష్టం. అయితే ఆ బాలుడి సోదరుడు ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఆ బాలుడిని, అనారోగ్యానికి గురైన అతడి సోదరుడిని తల్లిదండ్రులు బాబురామ్, శిరీష ఓ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ ఆస్పత్రిలో అతడు చికిత్స పొందాడు. ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళుతుండగా అనుకోని ప్రమాదం ఆ బాలుడి ప్రాణాలను తీసింది. దీంతో అతడి తల్లి కంటికి ధారగా విలపిస్తోంది. చూసేందుకు ఈ దృశ్యం హృదయ విదారకంగా ఉంది.

బైక్ అదుపుతప్పి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడు గ్రామానికి చెందిన బాబురామ్, శిరీష దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు పేరు శ్యామ్ (5), చిన్నోడికి మూడు సంవత్సరాలుగా ఉంటాయి. అయితే చిన్నోడు అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు పెద్ద కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై సోమవారం రాజంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ ఆ బాలుడికి చికిత్స అందించారు. తిరిగి ఇంటికి వెళుతుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. దీంతో ముందు కూర్చున్న పెద్ద కుమారుడు శ్యామ్ ఎగిరి రోడ్డుపై పడ్డాడు. దీంతో అతని తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అతడు అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. వైద్య సిబ్బంది శ్యామ్ మృతదేహాన్ని ఆసుపత్రిలోని ఓ బెడ్ పై ఉంచారు. దీంతో అతని తల్లి పక్కనే పడుకుంది. ” బుజ్జీ.. ఎంతసేపు పడుకుంటావు.. నాన్నా త్వరలో నిద్ర నుంచి లే. స్కూల్ కు టైం అవుతోంది. త్వరగా రెడీ అయ్యి స్కూల్ కు వెళ్ళు.” అంటూ భ్రమ లో ఉండిపోయింది. బాబురామ్ ఆమెను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. బాబు నిద్ర లేచిన తర్వాతే ఇంటికి వెళ్దామని ఆమె చెప్పడంతో.. బాబు రామ్ కూడా దిక్కులు పిక్కటిల్లే విధంగా రోదించాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది కూడా విలపించారు. అయితే ద్విచక్ర వాహనం ఒక్కసారిగా అదుపుతప్పడంతో ఆ బాలుడు ఎగిరి రోడ్డు మీద పడ్డాడు. తల వెనుక భాగంలో తీవ్ర గాయం అయింది. రక్త స్రావం కూడా జరిగింది. ఫలితంగా ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఎదురుగా ఒక వాహనం రావడంతో.. దానిని తప్పించే క్రమంలో బాబు రామ్ బైక్ అదుపు తప్పిందని స్థానికులు అంటున్నారు.