
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కలవర పెడుతోంది. ఇప్పటికే వైరస్ బారిన పడి అనేక మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే పిల్లలకు కరోనా సోకితే ఎలా అనే దానిపై పరిశోధనలు చేస్తున్నారు. పిల్లల్లో ఇమ్యూనిటీ పవరున్నా తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుందని గుర్తించారు. మొదటి, రెండో వేవ్ లో 10 శాతం పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలుస్తోంది. జనాభాలో 30 కోట్ల మంది పిల్లల్లో 14 శాతం మందికి కోవిడ్ సోకినట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 2021లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించిన సీరో సర్వేలో 25.3 శాతం మంది పిల్లలకు యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. రెండో వేవ్ లో దేశంలో 40 శాతం మంది పిల్లలకు వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. అంటే ఇంకా 60 శాతం మందికి ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని తెలిపారు.
కరోనా వైరస్ అదృష్టవశాత్తు పిల్లల్లో మరణాల రేటు తక్కువగానే ఉంది. కానీ భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేమని ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్, నెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ాక్టర్ జయప్రకాశ్ చెప్పారు. ఢిల్లీలో జరిగిన సీరో సర్వే ఫలితాలు చూస్తే ఈ ఇన్ఫెక్షన్ సోకడానికి ప్రత్యేక వయసు ఏమి లేదని అర్థం అవుతోంది. దేశ జనాభాలో 30 కోట్ల జనాభా ఉంది. వీరిలో ఇంకా చాలా మంది ఇన్ఫెక్షన్ బరిన పడే అవకాశం ఉంది. 18 కోట్ల మంది పిల్లలు వ్యాధి బారిన పడే సూచనలున్నాయి. ఇందులో ఇప్పటికే 3.6 కోట్ల మందికి వైరస్ సోకిందని తెలుస్తోంది. ఒక శాతం మందికి చికిత్స తీవ్ర స్థాయిలో అవసరం కావచ్చు. దీనికి సిద్ధంగా ఉండాల్సిల్సిన అవసరం ఏర్పడింది.
దేశంలో పెద్ద నగరాల్లో, పట్టణాల్లోనే పిల్లల ఇంటెన్సెవ్ కేర్ యూనిట్లు ఉణ్నాయి. మిగతా ప్రాంతాల్లో లేవు. ఉత్తరాది రాష్ర్టాల్లో కంటే దక్షిణాది రాష్ర్టాల్లో పెద్దలకే ఐసీయూలు ఉన్నాయి. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో పిల్లల ఇంటెన్సెవ్ కేర్ యూనిట్లపై స్పష్టత లేదు. దేశంలో 40 వేల పిల్లల ఐసీయూలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో ఒక వేళ ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువ మంది పిల్లలు వ్యాధి బారిన పడితే మే నెలలో ఐసీయూలో చేరే పిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ సోకిన 3-4 వారాల్లో ఈ సిండ్రోమ్ అభివృద్ధి చెందుతోంది. దీన్ని పోస్ట్ కోవిడ్ ఇన్ఫలమేటరీ రియాక్షన్ అంటారు. దీంతో పిల్లలు బాగా జబ్బు పడే అవకాశాలు ఉన్నాయి.
పిల్లల్లో వ్యాధి తీవ్రత ఉణ్నా ఊపిరితిత్తులు కలుషితం కాకుండా ఉండడంతో వారికి దీర్ఘకాలిక రోగాలు లేకపోవడంతో ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగా ఉండే అవకాశముంది.12-18 సంవత్సరాల వయసు పిల్లలకు వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారనేది తెలియదు. నాలుగు నెలల్లో ఎంత మంది పెద్ద వారికి వ్యాక్సిన్ వేస్తారో కూడా తెలియదు. దీంతో మాస్క్ ఒక్కటే ప్రధాన కవచంగా చెబుతున్నారు.