తాటికల్లుతో కరోనా వైరస్ ఖతం.. అసలు నిజమేంటంటే..?

కరోనా సెకండ్ వేవ్ లో అధికారులు, ప్రజల అంచనాలను మించి కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చిన్నచిన్న పొరపాట్ల వల్ల చాలామంది కరోనా బారిన పడుతున్నారు. అయితే తాటికల్లుతో కరోనా వైరస్ కు చెక్ పెట్టవచ్చంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఆయుర్వేద నిపుణులు తాటికల్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. అయితే నిల్వ ఉన్న కల్లు కాకుండా అప్పుడే […]

Written By: Navya, Updated On : May 6, 2021 8:46 pm
Follow us on

కరోనా సెకండ్ వేవ్ లో అధికారులు, ప్రజల అంచనాలను మించి కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చిన్నచిన్న పొరపాట్ల వల్ల చాలామంది కరోనా బారిన పడుతున్నారు. అయితే తాటికల్లుతో కరోనా వైరస్ కు చెక్ పెట్టవచ్చంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఆయుర్వేద నిపుణులు తాటికల్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు.

అయితే నిల్వ ఉన్న కల్లు కాకుండా అప్పుడే తీసిన కల్లును తాగితే మంచిదని తెలుస్తోంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో, జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో తాటికల్లు తోడ్పడుతుంది. పరగడుపున తాటికల్లు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే తాటికల్లు తాగితే కరోనా వైరస్ ఖతం అవుతుందని ఇప్పటివరకు ఎక్కడా ప్రూవ్ కాలేదు. అయితే కొంతమంది ప్రజలు మాత్రం తాటికల్లుతో కరోనాకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు.

పెద్దపల్లికి జిల్లాకు చెందిన కనికిలి గ్రామానికి చెందిన వాళ్లు తాటికల్లు తాగితే కరోనా సోకదని విశ్వసిస్తూ తాటికల్లు కోసం ఆర్డర్లు పెడుతుండటం గమనార్హం. కొంతమంది తాటికల్లు కొరకు అడ్వాన్స్ బుకింగ్ పెడుతున్నారు. ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోకపోతే తాటికల్లు దొరకడం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గీత కార్మికులు తాటికల్లు రేటును పెంచి అమ్ముతుండటం గమనార్హం. గీత కార్మికులు కరోనా వైరస్ సోకకుండా నిబంధనలు పాటిస్తూ కల్లు పోస్తుండటం గమనార్హం. కల్లు తాగితే కరోనా పోతుందంటూ సోషల్ మీడియాలో వార్త తెగ వైరల్ అవుతోంది.