కరోనా లక్షణాలున్నా పరీక్షల్లో నెగిటివ్.. అసలు కారణమిదే..?

భారత్ లో ప్రజలు ఊహించని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో భయంకరంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇదే సమయంలో చాలామందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నా పరీక్షల్లో నెగిటివ్ వస్తోంది. యాంటీజెన్ పరీక్షలతో పాటు ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో సైతం చాలామందికి కరోనా నెగిటివ్ నిర్ధారణ అవుతోంది. అయితే శాస్త్రవేత్తలు, వైద్యులు పరీక్షల్లో నెగిటివ్ రావడానికి అసలు కారణాన్ని వెల్లడించారు. వైరస్ సోకినా కరోనా లక్షణాలు […]

Written By: Navya, Updated On : May 5, 2021 4:25 pm
Follow us on

భారత్ లో ప్రజలు ఊహించని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో భయంకరంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఇదే సమయంలో చాలామందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నా పరీక్షల్లో నెగిటివ్ వస్తోంది. యాంటీజెన్ పరీక్షలతో పాటు ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో సైతం చాలామందికి కరోనా నెగిటివ్ నిర్ధారణ అవుతోంది. అయితే శాస్త్రవేత్తలు, వైద్యులు పరీక్షల్లో నెగిటివ్ రావడానికి అసలు కారణాన్ని వెల్లడించారు.

వైరస్ సోకినా కరోనా లక్షణాలు కనిపించని వాళ్లకు నెగిటివ్ వస్తే వాళ్ల నుంచి ఇతరులకు వైరస్ సోకే అవకాశాలు అయితే ఉంటాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎమ్ఆర్) ఆర్టీ పీసీఆర్ ఫలితాల్లో కచ్చితత్వం 95 శాతమే అని చెబుతుండటం గమనార్హం. ఆర్టీ పీసీఆర్ పరీక్షలో వైరల్ లోడ్, సేకరించిన శాంపిల్ నాణ్యత మరియు ప్రాసెసింగ్, పరీక్ష చేసే కిట్ సమర్థత, పరీక్షను అర్థం చేసుకునే విధానాన్ని బట్టి సదరు వ్యక్తికి కరోనా సోకిందా..? లేదా..? నిర్ధారించడం జరుగుతుంది.

శరీరంలో కరోనా వైరస్ అభివృద్ధి జరగాలంటే సాధారణంగా ఐరు రోజుల సమయం పడుతుంది. వైరస్ అభివృద్ధి జరగక ముందే కరోనా పరీక్షలు చేయించుకున్నా నెగిటివ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ కారణం వల్లే ఎక్కువ మందికి నెగిటివ్ వస్తోందని వైద్యులు చెబుతున్నారు. అయితే కొంతమందిలో మాత్రం కరోనా వైరస్ మ్యూటెంట్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.

ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వాళ్లు బ్రాంకోల్వియోలర్ లావేజ్ పరీక్ష చేయించుకుంటే మంచిది. బ్రాంకోస్కోప్ సాయంతో శాంపిల్స్ ను సేకరించి ఈ పరీక్ష చేయించుకుంటే మంచిది. శాంపిల్ బాగలేకపోవడం, దాన్ని సరిగా నిల్వ చేయకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు నెగిటివ్ వస్తోందని వైద్యులు వెల్లడిస్తున్నారు.