
కరోనా ఫస్ట్ వేవ్ లో చైనాతో పాటు ప్రపంచ దేశాల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే సెకండ్ వేవ్ లో మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మరోవైపు కరోనా వైరస్ కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు తుమ్ములు, గొంతునొప్పి కరోనా లక్షణాలుగా ఉండేవి. అయితే తాజాగా కరోనా లక్షణాల్లో మరో రెండు లక్షణాలు చేరాయి.
నాలుక పొడిబారడం, దురద, నొప్పి, నోటి పుండ్లు కూడా కరోనా లక్షణాలేనని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. జ్వరం కనిపించకుండా రోగికి బలహీనత అనిపించినా కరోనా కావచ్చని సమాచారం. నాలుక సంబంధిత సమస్యల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నోటిలో పొడిబారడం లేదా నాలుక దురదతో ఎవరైనా తీవ్ర బలహీనతను అనుభవిస్తే ఆర్టీ పీసీఆర్ చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.
పూర్తిస్థాయిలో ఈ లక్షణాలపై ప్రయోగాలు జరగాల్సి ఉన్నా ప్రస్తుతానికి ఈ లక్షణాలను కరోనా లక్షణాలుగా గుర్తించాలని వైద్య నిపుణులు పేర్కొన్నారు. జ్వరం లేకపోయినా అలసిపోతూ ఉంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. భారతదేశంలో మొదట కనుగొనబడిన డబుల్ మ్యూటెంట్ వల్ల కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
ఏపీలో త్వరలో లాక్ డౌన్ అమాలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.