ఎంపీ రఘురామను తక్షణమే రమేశ్ హాస్పటల్ కు పంపాలి.. హైకోర్టు ఆదేశం

ఎంపీ రఘురామను వైద్య పరీక్ష నిమిత్తం తక్షణం రమేశ్ హాస్పటల్ కు పంపాలని ఏపీ హైకోర్టు సీఐడీ అధికారులను ఆదేశించింది. రఘురామ కేసులు సాయంత్రం విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రమేశ్ హాస్పటల్ లోనూ  పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాన్ని అధికారులు పట్టించుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కస్టడీలో ఉండగానే సీఐడీ అధికారి పిటిషనర్ ను కలిశారు. కస్టడీలో ఉండగా పిటిషనర్ ను కలవడం చట్ట విరుద్ధమని కోర్టుకు […]

Written By: Suresh, Updated On : May 16, 2021 7:31 pm
Follow us on

ఎంపీ రఘురామను వైద్య పరీక్ష నిమిత్తం తక్షణం రమేశ్ హాస్పటల్ కు పంపాలని ఏపీ హైకోర్టు సీఐడీ అధికారులను ఆదేశించింది. రఘురామ కేసులు సాయంత్రం విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రమేశ్ హాస్పటల్ లోనూ  పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాన్ని అధికారులు పట్టించుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కస్టడీలో ఉండగానే సీఐడీ అధికారి పిటిషనర్ ను కలిశారు. కస్టడీలో ఉండగా పిటిషనర్ ను కలవడం చట్ట విరుద్ధమని కోర్టుకు న్యాయవాది విన్నవించారు. కాగా రఘురామకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఇప్పటివే ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి ఎంపీ రఘురామను జిల్లా జైలు నుంచి తక్షణం రమేశ్ దవాఖానకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.