https://oktelugu.com/

ఎన్-95 మాస్క్ ను మళ్లీ మళ్లీ వాడాలంటే ఇలా చెయ్యండి!

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్ లు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. అన్ని రకాల మాస్కుల కంటే ఎన్-95 మాస్క్ 95% వైరస్ వ్యాప్తి నుండి మనల్ని రక్షిస్తుంది. మార్కెట్లో ఈ మాస్క్ ల ధర దాదాపు 400 రూపాయలు ఉంది. ప్రతిరోజు ఇంత ఖరీదైన మాస్క్ ను మార్చాలి అంటే అది వీలుకాని పరిస్థితి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ మాస్క్ ను తిరిగి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 5, 2020 / 08:56 PM IST
    Follow us on

    ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్ లు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. అన్ని రకాల మాస్కుల కంటే ఎన్-95 మాస్క్ 95% వైరస్ వ్యాప్తి నుండి మనల్ని రక్షిస్తుంది. మార్కెట్లో ఈ మాస్క్ ల ధర దాదాపు 400 రూపాయలు ఉంది. ప్రతిరోజు ఇంత ఖరీదైన మాస్క్ ను మార్చాలి అంటే అది వీలుకాని పరిస్థితి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ మాస్క్ ను తిరిగి వాడవచ్చా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే వాడవచ్చని చెబుతున్నారు నిపుణులు. అలాంటి ఆ మాస్కు ఏ విధంగా వాడాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం.

    Also Read : బ్రేకింగ్: చంద్రబాబు కాన్వాయ్ కు ప్రమాదం

    ఎన్-95 మాస్క్ ను ధరించి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఆ మాస్క్ ని పడేయాల్సిన అవసరం లేదు. మరి మరి తిరిగి వాడొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎన్-95 మాస్ కును వివిధ రకాల పద్ధతులలో తిరిగి వాడవచ్చు. అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ వంటి ప్రయోగాల ద్వారా ఖచ్చితమైన ఫలితం లభిస్తుందని వెల్లడైంది.

    అల్ట్రా వైలెట్ రేడియేషన్ పద్ధతి అందరికీ అందుబాటులో ఉండదు.. కాబట్టి ఒక గిన్నెలో నీరు పోసి ఆ నీటిని 85 డిగ్రీల వరకు వేడి చేయాలి. ఆ నీటిలో ఈ మాస్క్ ను ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి తరువాత ఆ మాస్క్ ను బయట ఆరవేయాలి. ఇలా చేయడం ద్వారా మాస్క్ లోని ఫిల్టరేషన్ సామర్థ్యం దెబ్బతినకుండా ఉంటుంది.

    ఇలా చేయడం ద్వారా మాస్క్ ను తిరిగి దాదాపు పది సార్లు వాడవచ్చు. సబ్బు, నీరు, ఆల్కహాల్, బ్లీచ్ వంటి వాటిలో రాత్రి అంతా నిల్వ ఉంచి మాస్క్ లను ఉతకడం మంచిదికాదని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అలా చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టే సామర్థ్యం మాస్క్ కోల్పోతుంది. ఇలా తగు జాగ్రత్తలు పాటించడం ద్వారా అతి భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి నుండి బయటపడవచ్చు.

    Also Read : బాబు ఇంత జరిగినా మారలేదా… తిట్టినా ఆ పార్టీనే కావాలా…?