మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటాడని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అవసరం అనుకుంటే చంద్రబాబు బద్ధ శత్రువులు ఉన్న పార్టీతో సైతం జత కట్టగలడు. అవసరం తీరిపోతే ఆ పార్టీ నేతలపై తనకు సన్నిహితంగా ఉండే నేతలతో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయించగలడు. అవసరానికి తగినట్టు సమయస్పూర్తితో వ్యవహరించడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య.
Also Read : జగన్ ఆ నేతలకు ప్రాధాన్యత ఇచ్చి తప్పు చేస్తున్నాడా…?
రాజకీయ చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు 2014లో అధికారమే లక్ష్యంగా బీజేపీ, జనసేనతో జత కట్టాడు. అయితే చంద్రబాబును అదృష్టం వరించడంతో 108 సీట్లతో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన కొత్తలో బీజేపీని ఆకాశానికెత్తిన చంద్రబాబు నాలుగేళ్ల అనంతరం బీజేపీని, మోదీని తిడుతూ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
2019 ఎన్నికల నాటికి బీజేపీతో శత్రుత్వం ఏర్పడటం, జనసేన సొంతంగా పోటీ చేయడానికి మొగ్గు చూపడంతో టీడీపీ చరిత్రలో కనీవిని ఎరువని చవిచూడాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం చంద్రబాబు 2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా ఆ విమర్శలను పట్టించుకోవద్దంటూ పార్టీ నేతలకు సూచిస్తున్నాడు.
బీజేపీ నేతలు తిడుతున్నా ఆ పార్టీతో సన్నిహితంగా మెలగడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. అయితే ఇప్పటికే ఒకసారి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని పొందిన అనుభవాల నేపథ్యంలో బీజేపీ చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు. అయితే చంద్రబాబు పట్టు వదలని విక్రమార్కుడు కాబట్టి సమీప భవిష్యత్తులో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read : బ్రేకింగ్: చంద్రబాబు కాన్వాయ్ కు ప్రమాదం