తెలుగు రాష్ట్రాల్లో గత రెండు, మూడు రోజులుగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ వల్ల కేసులు పెరిగితే మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేస్తారని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కు సంబంధించి అధ్యయనాలు చేస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు ఎక్కువగా నిద్రపోయే వారికి కరోనా సోకే అవకాశాలు తక్కువని వెల్లడించారు.
Also Read: కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్.. నోటిపై కూడా..?
శాస్త్రవేత్తలు చేసిన ఒక అధ్యయనంలో ఎక్కువ నిద్ర వల్ల కరోనా సోకే అవకాశాలు భారీగా తగ్గుతాయని వెల్లడైంది. కరోనా బారిన పడ్డ హెల్త్ కేర్ వర్కర్లపై అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. చక్కటి నిద్ర వల్ల కరోనా సోకే అవకాశాలు భారీగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బీఎంజే న్యూట్రిషన్ ప్రివెన్షన్ అండ్ హెల్త్ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి.
Also Read: కరోనా ఎఫెక్ట్.. బెంగళూరు వెళ్లేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ?
నిద్రలేమి, మానసిక ఒత్తిళ్లతో బాధ పడే వాళ్ల శరీరంలో కరోనా వైరస్ సులువుగా ప్రవేశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. తగినంత సమయం నిద్ర పోవడం ద్వారా కరోనాకు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజువారీ నిద్రతో పోలిస్తే ఎన్ని గంటలు ఎక్కువగా నిద్రపోతే కరోనా సోకే అవకాశాలు అంత తగ్గుతాయని చెప్పవచ్చు. నిద్రపోవడం ద్వారా కూడా కరోనా సోకే అవకాశాలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం.
నిద్రలేమి, మానసిక ఒత్తిళ్ల వల్ల తీవ్రమైన జబ్బుల బారిన పడిన పడే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అందువల్ల తక్కువ సమయం నిద్రపోయే వాళ్లు నిద్ర అలవాట్లను మార్చుకుంటే మంచిది