Corona: దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. ఇన్నాళ్లు లక్ష్లల్లో వచ్చిన కేసులు ప్రస్తుతం లక్షకు కిందకు దొగొచ్చాయి. దీంతో ప్రజల్లో ఇకింత సంతోషంగా ఉన్నా మరణాల రేటు మాత్రం పెరుగుతోంది. పాజిటివిటీ రేలు తగ్గుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఉన్నా కేసుల సంఖ్యలో మార్పులు రావడంతో ప్రజలు ఆందోళన చెందకున్నా మరణాల రేటు విషయంలోనే భయం నెలకొంది.
India Corona Update
ఇప్పటికే పాఠశాలలకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు. కానీ కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ యథాతథంగా ప్రారంభించారు. మరోవైపు టీకాల కార్యక్రమం కూడా వేగంగా సాగుతోంది. 15-18 సంవత్సరాల వయసు వారికి కూడా టీకాలు వేశారు. అందుకే కరోనా ప్రభావం తగ్గినట్లు తెలుస్తోంది. దీంతోనే కరోనా రెండేళ్లుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.
చైనాలో పుట్టిన వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దీని ధాటికి అన్ని వయసుల వారు ఇబ్బందులు పడుతున్నారు. మొదటి వేవ్ లో వయసు మళ్లిన వారిపై ప్రభావం చూపగా రెండే దశలో యువతనే లక్ష్యంగా చేసుకుంది. ఇక ప్రస్తుతం మూడో దశ నడుస్తుందని చెబుతున్నారు. కానీ థర్డ్ వేవ్ లో అంతగా ప్రభావం చూపలేకపోయినా మరణాల రేటులో కాస్తంత భయం పట్టుకుంది.
India Corona Cases
ఏదిఏమైనా కరోనా కేసులు మాత్రం తగ్గడంతో అందరు ఊపిరి పీల్చుకుంటున్నారు. మళ్లీ కరోనాకు ముందు పరిస్థితి రావాలని ఆకాంక్షిస్తున్నారు. రికవరీల రేటు కూడా పెరుగుతోంది. దీంతోనే జనం గుండెల మీద చేయి వేసుకుని ఉండేందుకు పరిస్థితులు దోహదం చేస్తున్నాయని తెలుస్తోంది. కరోనా ప్రభావం టీకాలతోనే అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తానికి టీకాలు వేసుకోవడంతోనే కరోనా దిగొచ్చినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో కరోనా ప్రపంచాన్ని భయపెట్టినా ఇప్పుడు మాత్రం ఆ భయం తగ్గింది. దీంతో ప్రజల్లో కూడా ఆందోళన కనిపించడం లేదు. టీకాలు వేసుకోవడంతో ప్రజల్లో కూడా విశ్వాసం పెరిగింది. వైరస్ కూడా వెనక్కి తగ్గుతుందనే తెలుస్తోంది. ఈ పరిణామాలతో ప్రజల్లో మెల్లగా వైరస్ భయం పోయింది. ప్రస్తుతం ఎవరు కూడా వైరస్ ను లెక్కలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది.