
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ఒకటికి మించిన కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. మొదట ప్రజలందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి చాలా సంవత్సరాల సమయం పడుతుందని భావించిన అధికారులు ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్లు వచ్చిన నేపథ్యంలో 2021 డిసెంబర్ నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని భావిస్తున్నారు.
Also Read: తల్లిదండ్రులకు అలర్ట్.. పిల్లలకు వేగంగా సోకుతున్న కొత్తరకం కరోనా..?
అయితే కొన్ని ముస్లిం దేశాలు మాత్రం కరోనా వ్యాక్సిన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయా దేశాలు వ్యాక్సిన్ ను వ్యతిరేకించడానికి ముఖ్యమైన కారణమే ఉంది. కరోనా వ్యాక్సిన్ లో పంది మాంసం వినియోగించడంతో కొన్ని దేశాలు వ్యాక్సిన్ విషయంలో ఆసక్తి చూపట్లేదు. కరోనా వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తలు పంది మాంసంతో తయారు చేసిన జిలాటిన్ ను వినియోగించారు. జిలాటిన్ వినియోగం వల్ల కరోనా వ్యాక్సిన్ యొక్క లైఫ్ టైమ్ పెరుగుతుంది.
Also Read: కొత్తరకం కరోనాకు వ్యాక్సిన్ ఎప్పటిలోగా వస్తుందంటే?
అయితే శాస్త్రవేత్తలు మాత్రం వ్యాక్సిన్ల తయారీలో జిలాటిన్ వినియోగం సాధారణమేనని చెబుతున్నారు. పంది మాంసం లేకుండా వ్యాక్సిన్లను తయారు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నామని.. అయితే ఆ ప్రయత్నాలు ఇంకా జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేర్వేరు కారణాల వల్ల జిలాటిన్ వినియోగం తప్పనిసరి చేస్తున్నామని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
కొందరు ముస్లిం పెద్దలు మాత్రం మనుషుల ప్రాణాలను కాపాడటం కోసం హరామ్ పదార్థాలను వినియోగించడంలో తప్పేం లేదని చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ కు మతానికి సంబంధం లేదని మనుషుల ప్రాణాలను మించి ఏదీ ముఖ్యం కాదని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు.