
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాటల దాడి కొనసాగిస్తున్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీ సర్కార్ తలపెట్టిన భూసర్వేపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఆరు రకాల భూములపై జగన్ కన్ను పడిందని, అందుకే భూ సర్వే పేరుతో హడావిడి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పార్టీ సీనియర్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కీలక కామెంట్లు చేశారు. ప్రజల ఆస్తులు కాజేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారని, అందుకే భూ సర్వే చేస్తున్నారని విమర్శించారు.జగన్ సర్కార్ చర్యల వల్ల ఇక నుంచి ఆస్తులు, భూములు నిత్యం చెక్ చేసుకునే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు అన్నారు.