
కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశమై మంగళవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా కారణంగా తెలంగాణలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైన విషయాన్ని ప్రస్తావించారు. చాలా మంది ఉద్యోగులు కూడా కోవిడ్ భారిన పడ్డారని అన్నారు. గ్రామ సచివాలయాల పని తీరు బాగుందని, ప్రధాని మోదీ సైతం మెచ్చుకున్నారని చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉద్యోగులు ఇంటింటికి చేర్చడంపై ప్రజలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో మూడు రాజధానుల అంశంపైనా ఆయన చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.