Omicron Scare: నిర్లక్ష్యానికి ‘ఒమిక్రాన్’ మూల్యం

Omicron Scare: గత రెండేళ్లుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా యేటా తన రూపును మార్చుకుంటూ.. ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. ప్రతీఒక్కరినీ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మొదటివేవ్లో తీవ్ర నష్టాన్ని చవిచూసిన ప్రపంచదేశాలు.. మరోసారి అలాంటి విపత్తు రాకుండా నివారించాలని ఎన్నో ప్రయోగాలు చేశాయి. వివిధ రకాల వ్యాక్సిన్లు కనిపెట్టి.. తమదేశ పౌరులు వ్యాక్సినేషన్ తీసుకునేలా చర్యలు తీసుకున్నాయి. వ్యాక్సినేషన్ ప్రారంభ దశలోనే కరోనా మరో వేరియెంట్ రూపంలో విరుచుకుపడింది. ఓవైపు వ్యాక్సినేషన్ జరుగుతుండగానే […]

Written By: Neelambaram, Updated On : December 3, 2021 8:28 pm
Follow us on

Omicron Scare: గత రెండేళ్లుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా యేటా తన రూపును మార్చుకుంటూ.. ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. ప్రతీఒక్కరినీ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మొదటివేవ్లో తీవ్ర నష్టాన్ని చవిచూసిన ప్రపంచదేశాలు.. మరోసారి అలాంటి విపత్తు రాకుండా నివారించాలని ఎన్నో ప్రయోగాలు చేశాయి. వివిధ రకాల వ్యాక్సిన్లు కనిపెట్టి.. తమదేశ పౌరులు వ్యాక్సినేషన్ తీసుకునేలా చర్యలు తీసుకున్నాయి. వ్యాక్సినేషన్ ప్రారంభ దశలోనే కరోనా మరో వేరియెంట్ రూపంలో విరుచుకుపడింది. ఓవైపు వ్యాక్సినేషన్ జరుగుతుండగానే కుప్పలుతెప్పలుగా.. కరోనా మృతదేహాలు మరుభూమిని నింపేశాయి. సెకండ్ వేవ్ అమెరికా.. భారత్ వంటి పెద్దదేశాలను కకావికలం చేసింది. రోజుకు లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు.. ఏం చేయాలో తోచని పరిస్థితి.. ఈక్రమంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో మెల్లిమెల్లిగా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిపోయింది. వ్యాక్సిన్ తీసుకున్నాం కదా.. మరేం భయంలేదు అంటూ.. అమెరికా అధ్యక్షుడు సైతం మాస్క్ ను పక్కన పడేయండంటూ.. సందేశం సైతం ఇవ్వడం మనం చూశాం. చాలా దేశాల ప్రభుత్వాలు బూస్టర్ డోసులను కూడా తమ ప్రజలకు ఇప్పించాయి.

Omicron Scare

అయితే సరిగ్గా ఆరుమాసాలు అంతా ప్రశాంతం. ఎక్కడా కేసుల భయం పెద్దగా కనిపించలేదు. హమ్మయ్యా.. ఇక మహమ్మారి గొడవ వదలిపోయిందని అని ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో.. మరో ఉపద్రవం.. ప్రపంచంలోని చాలా దేశాలు కరోనా సమయంలో తమ క్షేమాన్ని మాత్రమే చూడగా.. పేద దేశాలను పెద్దగా పట్టించుకోలేదు. వ్యాక్సినేషన్ విషయంలో తమదేశంలో పూర్తియిన కూడా.. మిగిలిపోయిన వ్యాక్సిన్లతో బూస్టర్ డోసులను వేసుకున్నారు.. కానీ.. ఆఫ్రికా వంటి పేదదేశాలను ఆదుకోవాలని ఏ ఒక్క సంపన్న రాజ్యం కూడా ఆలోచన చేయకపోవడమే.. ఇప్పుడు ముంచుకొస్తున్న ముప్పు.. ఒమిక్రిన్… ప్రస్తుతం ప్రపంచమంతా ఒమిక్రిన్ భయం పట్టుకుంది.కొత్తరకం వేరియంట్ ప్రపంచ పెద్దన్నలను మరోసారి పరుగులు పెట్టిస్తోంది. కరోనా రెండు వేరియంట్లనుంచి ప్రజలు ఇంకా కోలుకోక ముందే.. దక్షిణాఫ్రికాలో పురుడుపోసుకున్న బి.1.1.529 వేగంగా ప్రపంచదేశాలను చుట్టేస్తోంది.

Also Read: ప్రజల్లో ఆందోళన పుట్టిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్?

అయితే గత రెండు వేరియంట్లకన్నా ఒమిక్రిన్ చాలా ప్రమాదకరమైందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తుండడంతో ప్రపంచదేశాలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ వో హెచ్చరికలు ఇప్పటికే జారీ చేసింది. ఈ వేరియంట్ పురుడుపోసుకున్న కొద్దిసమయంలోనే ప్రపంచ నలుమూలల ఉన్న దేశాల్లో విస్తరించింది. అమెరికా.. ఇండియాలోనూ అడుగుపెట్టింది. కరోనా ఫస్ట్.. సెకండ్ వేవ్ సమయంలో వ్యాక్సినేషన్ పూర్తికాలేదని.. ప్రస్తుతం వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని ధీమాగా ఉంటే మూల్యం చెల్లించక తప్పదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. ప్రస్తుత ఒమిక్రెన్ వేరియంట్… అనేది దక్షిణాఫ్రికాలోని ఒక హెచ్ఐవీ పేషెంటులో బయటపడిందని.. సో ఎలాంటి యాంటీబాడీస్ పనిచేయని వ్యక్తి శరీరం నుంచి ఇది పుట్టుకురావడంతో ప్రస్తుతం రెండు డోసులు వేసుకున్న వారు సైతం తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోని సంపన్న దేశాలన్నీ వ్యాక్సినేషన్ తీసుకోగా.. పేదదేశమైన ఆఫ్రికాను ఎవరూ పట్టించుకోలేదు.. నిధులున్నా.. చిన్నదేశాలను పట్టించుకోలేదు.. ఫలితంగా వ్యాక్సినేషన్ లేని దేశం నుంచే మూడో ముప్పు బయటికి వచ్చింది. ప్రపంచ దేశాలను మరోసారి వణికిస్తోంది.. సో.. బీ అలర్ట్.. మాస్క్.. మస్ట్…

Also Read: మహామ్మరి ‘ఒమ్రికాన్’.. అప్రమత్తంగా ఉండాల్సిందే..!

Tags