https://oktelugu.com/

Mahesh Babu: రెండు నెలల పాటు ఎక్కడకి కదలడానికి వీలు లేని సూపర్ స్టార్ మహేష్ బాబు…

Mahesh Babu: గత రెండేళ్లుగా కరోనా కారణంగా చిత్రాలు విడుదల చేయకపోవడంతో… హీరోలంతా వరస సినిమాలతో దూసుకుపోతున్నారు. టాలీవుడ్ హీరోలంతా కరోనా కారణంగా ఎక్కువ గ్యాప్ రావడంతో వీలైనంత త్వరగా సినిమాలను పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. దీంతో ఎక్కువ సమయం పనిచేస్తూ ఒత్తిడికి గురి అవ్వడం వల్ల షూటింగ్ సమయంలో గాయాలు పాలైన సంగతి తెలిసిందే. వీరిలో ఎన్టీఆర్, చిరంజీవి, ఉండగా తాజాగా వీరి లిస్ట్ లో బాలకృష్ణ కూడా చేరి  తన భుజానికి ఆపరేషన్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 3, 2021 / 08:10 PM IST
    Follow us on

    Mahesh Babu: గత రెండేళ్లుగా కరోనా కారణంగా చిత్రాలు విడుదల చేయకపోవడంతో… హీరోలంతా వరస సినిమాలతో దూసుకుపోతున్నారు. టాలీవుడ్ హీరోలంతా కరోనా కారణంగా ఎక్కువ గ్యాప్ రావడంతో వీలైనంత త్వరగా సినిమాలను పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. దీంతో ఎక్కువ సమయం పనిచేస్తూ ఒత్తిడికి గురి అవ్వడం వల్ల షూటింగ్ సమయంలో గాయాలు పాలైన సంగతి తెలిసిందే. వీరిలో ఎన్టీఆర్, చిరంజీవి, ఉండగా తాజాగా వీరి లిస్ట్ లో బాలకృష్ణ కూడా చేరి  తన భుజానికి ఆపరేషన్ చేయించుకున్నారు. అయితే ఇదే బాటలో మహేష్ బాబు కూడా ఉన్నట్లు సమాచారం.

    మహేష్ బాబు కి గత కొన్ని ఏళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో నొప్పి మరింత ఎక్కువ అవ్వడంతో, మహేష్ డాక్టర్ కి చూపించున్నట్లు తెలుస్తోంది.  అయితే శాశ్వత పరిష్కారం శస్త్ర చికిత్స ఒక్కటే అని వైద్యులు సూచించారట. దీంతో మహేష్ హైదరాబాద్ లో ప్రముఖ ఆర్థోపెడీషియన్ తో సర్జరీ చేయనున్నట్లు తెలిసింది. ఆపరేషన్ జరిగిన తరువాత మహేష్ బాబు రెండు నెలల పాటు ఎక్కడకి కదలడానికి వీలు లేదట. అందుకోసం అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారట మహేష్ బాబు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తన పార్ట్ కి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయిందట మిగిలిన సన్నివేశాలను ఏమైనా ఉంటే అది కూడా పూర్తిచేసి ఆపరేషన్ చేయించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. వచ్చే ఏడాది త్రివిక్రమ్ తో మరో సినిమా ప్రారంభించిన ఉన్నారట.