కరోనా సోకిన వాళ్లకు భారీ షాక్.. అసలేం జరిగిందంటే..?

కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వాళ్లలో కొంతమంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక వ్యక్తి మెదడులో ఏకంగా క్రికెట్ బంతి పరిమాణంలో బ్లాక్‌ఫంగస్‌ ఉండగా వైద్యులు చికిత్స చేసి ఫంగస్ ను తొలగించారు. బీహార్ రాజధాని పాట్నాలోని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు ఈ అరుదైన శస్త్రచికిత్సను చేశారు. మూయికి చెందిన ఆ రోగి పేరు అనిల్ కుమార్. మూడు గంటల పాటు వైద్యులు శ్రమించి ఫంగస్ ను […]

Written By: Navya, Updated On : June 13, 2021 5:17 pm
Follow us on

కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వాళ్లలో కొంతమంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక వ్యక్తి మెదడులో ఏకంగా క్రికెట్ బంతి పరిమాణంలో బ్లాక్‌ఫంగస్‌ ఉండగా వైద్యులు చికిత్స చేసి ఫంగస్ ను తొలగించారు. బీహార్ రాజధాని పాట్నాలోని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు ఈ అరుదైన శస్త్రచికిత్సను చేశారు. మూయికి చెందిన ఆ రోగి పేరు అనిల్ కుమార్.

మూడు గంటల పాటు వైద్యులు శ్రమించి ఫంగస్ ను తొలగించడం గమనార్హం. కొన్నిరోజుల క్రితం కరోనా వైరస్ నుంచి కోలుకున్న అనిల్ కుమార్ ఆ తరువాత బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. అనిల్ కుమార్ కు ఫంగస్ ముక్కు నుంచి ఏకంగా మెదడును చేరడం గమనార్హం. అయితే ఫంగస్ అనిల్ కుమార్ కళ్లకు మాత్రం విస్తరించలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఐజీఐఎంఎస్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మనీశ్ మండల్ శస్త్రచికిత్స సమయంలో అనిల్ కుమార్ కళ్లకు ఏ హాని జరగలేదని వెల్లడించారు. కరోనా వైరస్ బారిన పడిన వాళ్లలో చాలామంది త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతో స్టెరాయడ్స్ ను వినియోగిస్తున్నారు. స్టెరాయిడ్స్‌ను వాడటం వల్లే ఎక్కువమంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం.

మే 22వ తేదీన బీహార్ ప్రభుత్వం బ్లాక్‌ఫంగస్‌ను అంటువ్యాధిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా విషయంలో ఎక్కువగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. కరోనా సోకకుండా మాస్క్ ధరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.