Corona Third Wave in India: భారత్ లో మూడో దశ ముప్పు వచ్చిందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో దేశంలో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఢిల్లీ, మహారాష్ర్ట వంటి స్టేట్లలో కొవిడ్ కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహణపై ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
ఒమిక్రాన్ ప్రభావంతో ముంబైలో కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలుస్తోంది. అందుకే రాత్రి పూట కర్ఫ్యూ విధించేందుకు నిర్ణయించాయి. దీంతో మహమ్మారి వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆడపిల్లలకు ఉపద్రవం.. ఏంటీ కొత్త మార్పులు
ఇప్పటికే మూడో దశ ముప్పు పొంచి ఉందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో కేసుల సంఖ్య వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. కేసులు పెరుగుతున్నా ఆందోళన అవసరం లేదని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ త్వరగా విస్తరిస్తోన్నా దాని ప్రభావం మాత్రం తీవ్రంగా లేదని మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉండటం కొంత ఉపశమనం కలిగించేదే.
నిన్నటి బులెటిన్ ప్రకారం దేశంలో 781 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అత్యధికంగా ఢిల్లీలో 238, మహారాష్ర్టలో 167, గుజరాత్ లో 73, కేరళలో 65, తెలంగాణలో 62, రాజస్తాన్ లో 46 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో ఇప్పటివరకు 241 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు చెబుతున్నారు. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ తో ప్రమాదం లేకపోయినా జాగ్రత్తలు అవసరమే అని వెల్లడిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి కరోనాను దూరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏంటో తెలుసా.. లక్షణాలు ఎలా ఉంటాయంటే?