Zodiac Signs:  ఏ నక్షత్రంలో పుట్టిన పిల్లలకు ఏ పేర్లు పెడితే మంచి జరుగుతుందో తెలుసా?

Zodiac Signs:  తల్లిదండ్రులు పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. పిల్లలు పుట్టిన సమయం, నక్షత్రాన్ని బట్టి పండితులు సూచించిన మొదటి అక్షరాన్ని బట్టి చాలామంది పిల్లలకు పేర్లు పెడతారు. గత జన్మలో చేసుకున్న కర్మ ఫలితాలను బట్టి మాత్రమే ఈ జన్మలో మానవుడు అనుభవించే మంచి, చెడు ఆధారపడి ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. ప్రస్తుతం మంచి పనులు చేయడం ద్వారా గతంలో చేసిన చెడుకర్మ ఫలితాన్ని కూడా మార్చే ఛాన్స్ […]

Written By: Navya, Updated On : December 31, 2021 6:40 pm
Follow us on

Zodiac Signs:  తల్లిదండ్రులు పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. పిల్లలు పుట్టిన సమయం, నక్షత్రాన్ని బట్టి పండితులు సూచించిన మొదటి అక్షరాన్ని బట్టి చాలామంది పిల్లలకు పేర్లు పెడతారు.

గత జన్మలో చేసుకున్న కర్మ ఫలితాలను బట్టి మాత్రమే ఈ జన్మలో మానవుడు అనుభవించే మంచి, చెడు ఆధారపడి ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. ప్రస్తుతం మంచి పనులు చేయడం ద్వారా గతంలో చేసిన చెడుకర్మ ఫలితాన్ని కూడా మార్చే ఛాన్స్ ఉంటుంది.

జన్మ నక్షత్రాన్ని బట్టి పిల్లలకు పేర్లు పెట్టడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అశ్విని నక్షత్రంలో పుట్టిన పిల్లలకు చు, చే, (చో,చౌ),లా అక్షరాలతో భరణి నక్షత్రంలో పుట్టిన పిల్లలకు లీ, లూ, లే, లో అక్షరాలతో కృత్తిక నక్షత్రంలో పుట్టినవాళ్లకు ఆ, ఈ, ఊ, ఏ అక్షరాలతో రోహిణి నక్షత్రంలో పుట్టినవాళ్లకు ఓ, వా, వీ, వు అక్షరాలతో పెడితే మంచిది. మృగశిర నక్షత్రంలో పుట్టినవాళ్లకు వే, వో, ( కా , కృ ) , కీ అక్షరాలతో తెలిస్తే మంచిది.

ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన పిల్లలకు కూ, ఘ, ( జ్ఞ , జ్ఞా ) ఛా పునర్వసు నక్షత్రంలో పుట్టిన పిల్లలకు కే, కో, హా, హీ, పుష్యమి నక్షత్రంలో పుట్టిన పిల్లలకు హూ, హే, హో, డా ఆశ్రేషా నక్షత్రంలో పుట్టిన వాళ్లకు డి , డూ, డే, డో మఖ నక్షత్రంలో పుట్టిన వాళ్లకు మా, మీ, మూ, మే అక్షరాలతో పేర్లు పెడితే మంచిది. పుబ్బ నక్షత్రంలో పుట్టినవాళ్లకు మో, టా, టీ, టూ అక్షరాలతో పెడితే మంచిది.

ఉత్తర నక్షత్రంలో పుట్టిన పిల్లలకు టే, టో, ( పా, ఫ ), పి హస్త నక్షత్రంలో పుట్టిన పిల్లలకు పూ, ( షం , క్షే ) , ణా, ఠా అక్షరాలతో చిత్త నక్షత్రంలో పే, పో,( ప్ర, రా) , ( రీ , శ్రీ , బ్ర ) అక్షరాలతో, స్వాతి నక్షత్రంలో పుట్టిన పిల్లలకు ( రూ, హృ ), రే, ( రో, ద్రో , ద్రౌ ) త అక్షరాలతో అక్షరాలతో పేర్లు పెడితే మంచిది. విశాఖ నక్షత్రంలో పుట్టిన పిల్లలకు తీ, తూ, తే, తో అక్షరాలతో అనురాధ నక్షత్రంలో నా, నీ, నూ, నే అక్షరాలతో జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవాళ్లకు నో, యా, యీ, యూ అక్షరాలతో పేర్లు పెడితే మంచిది.

మూల నక్షత్రంలో పుట్టినవాళ్లకు (యె, యే ) , యో, బా, బి అక్షరాలతో పేర్లు పెడితే మంచిదని చెప్పవచ్చు. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన పిల్లలకు బూ, ధా,( భా , భై ), డా అక్షరాలతో పేర్లు పెడితే మంచిది. ఉత్తరాషాడ నక్షత్రంలో పుట్టినవాళ్లకు బే, భో , జా, జి అక్షరాలతో శ్రవణం నక్షత్రంలో పుట్టిన పిల్లలకు జూ, జే, జో, ఖ అక్షరాలతో పేర్లు పెట్టవచ్చు.

ధనిష్టా నక్షత్రంలో పుట్టిన పిల్లలకు గా, గీ, గూ, గే అక్షరాలతో శతభిషం నక్షత్రంలో పుట్టిన పిల్లలకు ( గో, గౌ ), సా, సీ, సు అక్షరాలతో పేర్లు పెట్టాలి. పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టిన పిల్లలకు సే, సో, దా, ది అక్షరాలతో ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టినవాళ్లకు దూ, ( శ్యం, శ, శ్యా ) , ఝా , థ అక్షరాలతో రేవతి నక్షత్రంలో పుట్టిన పుట్టిన పిల్లలకు దే, దో, చా, చి అక్షరాలతో పేర్లు పెడితే మంచిది.