Roja Shocking Comments on Nani: ఏపీలో సినిమా టికెట్స్ ప్రైసెస్ వ్యవహారంపై ఇంకా రచ్చ జరుగుతోంది. సినీ పరిశ్రమ, ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం టికెట్స్ ప్రైసెస్ తగ్గించడం, ఫలితంగా థియేటర్స్ మూసివేత నేపథ్యంలో తాజాగా నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.
సినిమా టికెట్ల ధరలు తగ్గించడం అంటే ప్రేక్షకులను అవమానించడమేనని, సినిమా థియేటర్స్ కలెక్షన్స్ కంటే కూడా కిరాణా దుకాణం కలెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయని అన్నారు. అంతే ఇక వివాదం రాజుకుంది.
నాని వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు అనిల్ , బొత్సా సత్యనారాయణ, పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. అలా సినిమా టికెట్ల ధరలపైన కౌంటర్, రీ కౌంటర్‌లు వస్తూనే ఉన్నాయి. అయితే, హీరో నాని వ్యాఖ్యలపైన వివాదం చేయొద్దని ప్రొడ్యూసర్ దిల్ రాజు రిక్వెస్ట్ చేశారు. కానీ, ఇంకా వివాదం ఎక్కువవుతున్నట్లే పరిస్థితులు కనబడుతున్నాయి. మంత్రి అనిల్ కుమార్ నాని వ్యాఖ్యలపైన స్పందిస్తూనే హీరోల రెమ్యునరేషన్స్ గురించి చర్చ లేవనెత్తారు. కాగా, తాజాగా హీరో నాని వ్యాఖ్యలపైన ప్రముఖ సినీ నటి, వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్, నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు.
Also Read: ఎన్టీఆర్ – చరణ్ మధ్య ఫైట్.. ఆర్ఆర్ఆర్ పై లేటెస్ట్ అప్ డేట్ !
హీరో నాని వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీకే నష్టం జరుగుతుందని, పేదల మేలు కోసమే సీఎం జగన్ పలు డెసిషన్స్ తీసుకుంటారని పేర్కొంది. ఈ క్రమంలోనే సినిమా టికెట్ల ధరల విషయమై త్వరలో వివాదాలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా టికెట్ల ధర విషయమై నియమించిన కమిటీ అన్ని అంశాలు అధ్యయనం చేసి సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపింది. హీరో నాని చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, నానికి సినిమాల కంటే కూడా కిరాణా వ్యాపారమే బెస్ట్ అని కౌంటర్ ఇచ్చింది.
థియేటర్స్ కంటే కిరాణా వ్యాపారం బాగా ఉందనే అభిప్రాయం ఉన్నప్పుడు, నాని సినిమాలు చేయడం వేస్టని, కిరాణా వ్యాపారమే చేసుకోవచ్చని సంచలన కామెంట్స్ చేసింది రోజా. కొంత మంది రాజకీయ నాయకులు తమ ఉనికి కోసం పార్టీలు పెట్టారని, అటువంటి వారి వల్లే ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని అంది రోజా. ఇలా నోటి దురదతో పలువురు చేసిన వ్యాఖ్యల వలనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయని, ప్రస్తుతం కూడా అటువంటి పరిస్థితులు వచ్చేలా ఉన్నాయని అభిప్రాయపడింది నగరి ఎమ్మెల్యే. అయితే, జగన్ ప్రభుత్వం చర్చలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, సినిమా రంగం వారి సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుందని చెప్పింది రోజా.
Also Read: ‘మహేష్ సినిమా’ పై ఓపెన్ అయిన రాజమౌళి !