కరోనా నుంచి కోలుకున్నారా.. వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలంటే..?

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ నిదానంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ల కొరత వల్ల దేశంలోని ప్రజల్లో చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నా ప్రజలకు వ్యాక్సిన్ లభ్యం కావడం లేదు. అయితే కరోనా నుంచి కోలుకున్న వాళ్లు వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలనే సందేహం చాలామందిని వేధిస్తోంది. వ్యాక్సిన్ల కొరత వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో వ్యాక్సిన్ల సలహా కమిటీ కీలక సూచనలు చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత ఆరు నుంచి తొమ్మిది […]

Written By: Navya, Updated On : May 18, 2021 5:34 pm
Follow us on

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ నిదానంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ల కొరత వల్ల దేశంలోని ప్రజల్లో చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నా ప్రజలకు వ్యాక్సిన్ లభ్యం కావడం లేదు. అయితే కరోనా నుంచి కోలుకున్న వాళ్లు వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలనే సందేహం చాలామందిని వేధిస్తోంది. వ్యాక్సిన్ల కొరత వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో వ్యాక్సిన్ల సలహా కమిటీ కీలక సూచనలు చేసింది.

కరోనా నుంచి కోలుకున్న తరువాత ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు వ్యాక్సిన్ ను వాయిదా వేసుకోవాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ సూచనలు చేసింది. ఈ వ్యవధి వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ భావిస్తోంది. కేంద్రానికి సంస్థ ఈ మేరకు ప్రతిపాదనలు పంపగా కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.

ప్రస్తుత ప్రొటోకాల్ మాత్రం కరోనా నుంచి కోలుకున్న తర్వాత నాలుగు నుంచి 8 వారాల్లోపు టీకా తీసుకోవచ్చు. మరోవైపు కొవిషీల్డ్ టీకా రెండు మోతాదుల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండాలని ఈ సంస్థ గతంలో ప్రతిపాదనలు చేసింది. ప్లాస్మా ఎక్కించుకున్న వారు డిశ్చార్జ్ అయిన ఐదు నుంచి మూడు నెలలు వ్యాక్సినేషన్ కు దూరంగా ఉండాలని ఈ సంస్థ పేర్కొంది.

తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్నవారు, ఐసీయూ కేర్ అవసరమైన వారు సెకండ్ డోస్ ఆలస్యంగా తీసుకుంటే మంచిదని ఈ సంస్థ వెల్లడించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కోవిషీల్డ్ టీకా వేయించుకునే వారికి గ్యాప్ ను పెంచిన సంగతి తెలిసిందే.