https://oktelugu.com/

కరోనా బాధితులకు సోకుతున్న మరో వైరస్.. ఏమైందంటే..?

దేశంలో కరోనా వైరస్ విజృంభణ తర్వాత ప్రజలకు తెలియని ఎన్నో కొత్త వైరస్ లు, వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం కరోనా బాధితులు బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్, వైట్ ఫంగస్ బారిన పడుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కరోనా బాధితులను మరో కొత్త వైరస్ తెగ టెన్షన్ పెడుతోంది. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో ఐదుగురు కరోనా బాధితులు సిఎంవి ఇన్ఫెక్షన్ లేదా సైటోమెగలో వైరస్ బారిన పడ్డారు. ఈ వైరస్ సోకిన వాళ్లలో ఒకరు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 1, 2021 / 08:42 PM IST
    Follow us on

    దేశంలో కరోనా వైరస్ విజృంభణ తర్వాత ప్రజలకు తెలియని ఎన్నో కొత్త వైరస్ లు, వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం కరోనా బాధితులు బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్, వైట్ ఫంగస్ బారిన పడుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కరోనా బాధితులను మరో కొత్త వైరస్ తెగ టెన్షన్ పెడుతోంది. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో ఐదుగురు కరోనా బాధితులు సిఎంవి ఇన్ఫెక్షన్ లేదా సైటోమెగలో వైరస్ బారిన పడ్డారు.

    ఈ వైరస్ సోకిన వాళ్లలో ఒకరు ఇప్పటికే చనిపోవడం గమనార్హం. కరోనా బాధితులలో ఈ వైరస్ బయటపడటం ఇదే తొలిసారి అని కరోనా సోకిన 20 నుంచి 30 రోజుల తర్వాత ఈ వైరస్ సోకినట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకసారి ఈ వైరస్ బారిన పడితే వైరస్ శరీరంలోనే జీవితాంతం ఉంటుంది. వైరస్ సోకిన వ్యక్తి రక్తం, లాలాజలం, మూత్రం లేదా ఇతర శరీర ద్రవాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి.

    బలహీనమైన రోగనిరోధకశక్తి ఉన్నవాళ్లు ప్రధానంగా ఈ వైరస్ బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. భాటియా హాస్పిటల్ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ విపుల్‌రాయ్ రాథోడ్ మాత్రం ఇది సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ అని చెబుతున్నారు. గొంతు నొప్పి, కండరాల నొప్పులు, అలసట, వాపు గ్రంథులు, జ్వరం ఈ వైరస్ లక్షణాలుగా ఉన్నాయి.

    సకాలంలో రోగనిర్ధారణ చేసి చికిత్స తీసుకుంటే ఈ వైరస్ మరీ ప్రమాదకరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ కు లక్షణాలను బట్టి చికిత్స చేయాలని వైరస్ కు చికిత్స కోసం యాంటీ వైరల్ మందులు అవసరం లేదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.