Covid Fourth Wave In India: కరోనా ముప్పు ఇంకా వీడటం లేదు. ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తోంద. కరోనాతో సహవాసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో గత రెండేళ్లుగా కరోనాతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాం. దీంతో మొదటి, రెండో దశల్లో కరోనా ప్రభావం ఎంతో మందిని బలితీసుకుంది. ఈ నేపథ్యంలో కరోనా మూడో వేవ్ మాత్రం అంత ప్రభావం చూపలేదు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ నేపథ్యంలో నాలుగో దశ త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీనికి గాను శాస్త్రవేత్తలు ఇప్పటి నుంచే హెచ్చరిస్తున్నారు. ఇది నాలుగు నెలలు ఉంటుందని సూచిస్తున్నారు. జూన్ నెలలో కరోనా నాలుగో దశ రానుందని సమాచారం. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. కరోనా ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో నాలుగో దశ ఎలా ఉండబోతోందన్నదే ఉత్కంఠగా మారుతోంది.
Also Read: వంగవీటి జిల్లా లొల్లి మళ్లీ మొదలైంది
రెండో దశ నుంచి మూడో దశకు ఆరు నెలల సమయం తీసుకున్న కరోనా ఈ మారు నాలుగు నెలల సమయం తీసుకోనుందని తెలుస్తోంది. జూన్ లో ప్రారంభమయ్యే నాలుగో దశపై ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. కొత్త వేరియంట్ల ప్రభావంతో కరోనా రూపురేఖలు మారుతున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే వేరియంట్ల ప్రభావం నుంచి తట్టుకునేలా తయారు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది.

కరోనా టీకాలు వేసుకున్నందున దాని తీవ్రత తగ్గినట్లు కనిపిస్తోంది. మరోవైపు బూస్టర్ డోసులు కూడా వేస్తుండటంతో కరోనా మహమ్మారి ఇక ఏం చేయదనే ధీమా అందరిలో వ్యక్తమవుతోంది. అందుకే కరోనా భయం దాదాపుగా పోయినట్లే అనిపిస్తున్నా ప్రస్తుతం కరోనా నాలుగో దశ ఉందని తెలియడంతో ఏం చేయాలనే దానిపైనే అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇన్ని దశలు ఎదుర్కొన్నా ఇంకా భయం మాత్రం ఇంకా పోవడం లేదని తెలుస్తోంది.
Also Read: సంచలనం: 15 ఏళ్ల బాలికను వదల్లేదు.. టీఆర్ఎస్ నేతపై అత్యాచారం కేసు