దేశంలో కరోనా సెకండ్ వేవ్ కు అసలు కారణాలివే..?

దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో అంచనాలను మించి కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ నాలుగు లక్షలకు అటూఇటుగా కరోనా కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత, ఇతర సమస్యలు ఏర్పడుతున్నాయి. వైద్యుల కొరత, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కరోనా సెకండ్ వేవ్ కు అసలు […]

Written By: Navya, Updated On : May 6, 2021 10:25 am
Follow us on

దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో అంచనాలను మించి కరోనా వైరస్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ నాలుగు లక్షలకు అటూఇటుగా కరోనా కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత, ఇతర సమస్యలు ఏర్పడుతున్నాయి. వైద్యుల కొరత, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కరోనా సెకండ్ వేవ్ కు అసలు కారణాలను వెల్లడించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే దేశంలో ఊహించని స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే దేశంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ సర్కార్ ప్రపంచ దేశాల్లో కరోనా పరిస్థితులను అంచనా వేయడంలో ఫెయిల్ అయిందని వెల్లడించారు. మోదీ సర్కార్ అప్రమత్తంగా ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావని అన్నారు.

బ్రెజిల్ ను మోదీ సర్కార్ గమించి ఉంటే భారత్ లో నేడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడి ఉండేవి కాదని ఆయన వెల్లడించారు. గతంలో ప్రభుత్వ అధికారులు వైరస్ ను ఎదుర్కొన్నామని చెప్పారని ఇప్పుడు వాళ్లు ఏం చేస్తారని ప్రశ్నించారు. మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా చేపట్టాలని ఆయన వెల్లడించారు. మార్చి నెల నుంచి భారత్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు చేపడితే మాత్రమే కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.