India Corona Cases: ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో కొన్నాళ్లుగా నమోదవుతున్న కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తున్నా నిన్న నమోదైన కేసుల్లో తగ్గుదల కనిపించడం తెలిసిందే. దీంతో ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కర్ణాటకలో 46 వేల కేసులు నమోదు కాగా తమిళనాడు, మహారాష్ర్ట, కేరళ స్టేట్లలో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రెండేళ్లలో 3.97 కోట్ల మందికి కొవిడ్ సోకగా 4.9 లక్షల మంది చనిపోయినట్లు తెలుస్తోంది.
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం కూడా ఎక్కువగా అవుతోంది. దీంతో మూడో దశ ముప్పు వ్యాపిస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆంక్షలు కఠినతరం చేశారు. ఈనేపథ్యంలో దేశంలో కరోనా ప్రభావం ఎక్కువ అవుతోంది. తాజా కేసుల సంఖ్య చూస్తుంటే ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. రికవరీల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది.
ఒకవైపు టీకా వేసుకుంటున్నా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. 15-18 ఏళ్ల వయసు వారికి కూడా టీకా వేసేందుకు ఉపక్రమించారు. దాదాపు చాలా మందికి కూడా టీకాలు వేసి కరోనా బారి నుంచి రక్షించుకోవాలని చెబుతున్నారు.దీంతో కరోనా రక్కసి మాత్రం శాంతించడం లేదు. కొన్ని స్టేట్లలో తమ ప్రభావం తీవ్ర రూపం దాల్చుతోంది. జాగ్రత్తలు తీసుకుంటున్నా వ్యాప్తి మాత్రం తక్కువ కావడం లేదు.
Also Read: Self care for corona: కరోనా పట్ల ఆందోళన వద్దు.. అప్రమత్తతతో జాగ్రత్తలు ముద్దు..
మరోవైపు దేశంలో కేసుల సంఖ్య పెరగడంపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నా కేసుల సంఖ్య మాత్రం రెట్టింపవుతోంది. ఈక్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు. కరోనా బారి నుంచి రక్షించుకునే క్రమంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
గత రెండేళ్లుగా కరోనాతోనే ప్రజలు సహజీవనం చేయాల్సి వస్తోంది. మొదటి, రెండో దశల్లో ప్రజలను బలిగొన్న కరోనా మూడో దశలో మాత్రం ప్రాణాలను తీయకున్నా కేసుల సంఖ్యలో మాత్రం రెట్టింపుగా వ్యాపిస్తోంది. దీంతో కరోనా నివారణకు ప్రజలు రెడీగా ఉండాలని చెబుతున్నా రక్కసి ప్రబావం మాత్రం తగ్గడం లేదు. దీంతో భవిష్యత్ ఎలా మారుతుందో అనే ఆందోళనే అందరిలో వ్యక్తమవుతోంది.
Also Read: Corona vs Normal Fever: జలుబు, దగ్గు.. కొవిడా.. సాధారణ జ్వరమా.. నిపుణులు ఏమంటున్నారంటే?