https://oktelugu.com/

Mahesh Babu: దానికి బానిసైన మహేష్ బాబు… ఆందోళనలో నమ్రత!

మహేష్ కు ఇష్టమైన వ్యాపకాల్లో పుస్తకాలు చదవడం, నచ్చిన సినిమాలు చూడటం. ఇంట్లో మహేష్ చిన్న పిల్లాడైపోతాడు. సితార, గౌతమ్ లతో అల్లరి చేస్తాడు. ఆడుకుంటాడు. అయితే మహేష్ కి ఒక వ్యసనం ఉందట.

Written By:
  • NARESH
  • , Updated On : December 23, 2023 12:58 pm
    Follow us on

    Mahesh Babu: మహేష్ బాబుపై ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఓ వ్యసనంతో బాధపడుతున్నాడట. దాని నుండి బయటకు తీసుకురావాలని నమ్రత శిరోద్కర్ అనుకుంటున్నారట. మహేష్ బాబు పరిశ్రమలో మిస్టర్ పర్ఫెక్ట్. ఆయనకు సినిమా తర్వాత కుటుంబమే ప్రపంచం. ఖాళీ సమయం కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇష్టపడతాడు. ప్రతి ఏడాది నాలుగైదు దేశాలు చుట్టేస్తారు. టూర్స్ ని మహేష్ ఫ్యామిలీ ఆస్వాదిస్తారు.

    మహేష్ కు ఇష్టమైన వ్యాపకాల్లో పుస్తకాలు చదవడం, నచ్చిన సినిమాలు చూడటం. ఇంట్లో మహేష్ చిన్న పిల్లాడైపోతాడు. సితార, గౌతమ్ లతో అల్లరి చేస్తాడు. ఆడుకుంటాడు. అయితే మహేష్ కి ఒక వ్యసనం ఉందట. ఆయన వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడతాడట. వీడియో గేమ్స్ లో పిల్లలతో పోటీ పడతాడట. గంటల తరబడి మహేష్ వీడియో గేమ్స్ లో మునిగిపోతాడట.

    అయితే ఇది మహేష్ వైఫ్ నమ్రత శిరోద్కర్ నచ్చడం లేదట. మహేష్ ను వీడియో గేమ్స్ వ్యసనం నుండి బయట పడేయాలని ఆమె ప్రయత్నం చేస్తుందట. మహేష్ కి గతంలో సిగరెట్ అలవాటు ఉండేదట. ఆ వ్యసనం నుండి తర్వాత ఆయన బయటపడ్డారట. ఓ సందర్భంలో మహేష్ ఈ మేటర్ బయటపెట్టారు. మరోవైపు మహేష్ నిజ జీవితంలో కూడా శ్రీమంతుడులా సహాయం చేస్తున్నాడు. ఏపీ, తెలంగాణలలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు.

    ఛారిటీ ట్రస్ట్ ఏర్పాటు చేసి వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు తెరకెక్కిస్తున్న గుంటూరు కారం జనవరి 12న విడుదల కానుంది. శ్రీలీల హీరోయిన్ గా నటించింది. గుంటూరు కారం అనంతరం మహేష్ దర్శకుడు రాజమౌళితో మూవీ చేయనున్నారు. ఇది వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం…