
చైనా లో కరోనా వైరస్ భూతం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనలకు దారి తీస్తున్నాయి .. అయితే కరోనా నుంచి కోలుకుంటున్న చైనాలో కొత్తగా 1,541 మందిలో ఈ వైరస్ తాలూకు లక్షణాలు బయటపడడం ఇప్పుడు చైనీయుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ న్యూస్ వింటే ఇండియాలో లాక్ డౌన్ ఏమవుతుందో అనిపించకమానదు.
అలాగే భారత్‌లోనే కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్ధన ల్లో పాల్గొన్న 300 మందిలో కరోనా లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా ఇక ప్రార్థనల్లో పాల్గొన్న 800 మందిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచారు. ఈ ప్రార్థనల్లో దాదాపు 2 వేల మంది పాల్గొన్నట్టు తెలియడంతో దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. మన దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. దయ చేసి ఇంట్లోనే ఉంది పరిశుభ్రత పాటించండి చాలు అంటున్నారు Beware of carona