పేద దేశాల ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే కరోనా మందులు..?

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విసృతంగా వ్యాప్తి చెందుతోంది. అభివృద్ధి చెందిన దేశాలలో పలు దేశాలు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ కంపెనీలతో వ్యాక్సిన్ల గురించి పలు సంస్థలతో మందుల గురించి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఫలితంగా సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పేద దేశాలు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్, మందుల విషయంలో పేద దేశాలు పడుతున్న ఇబ్బందులను […]

Written By: Navya, Updated On : November 13, 2020 11:54 am
Follow us on


ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విసృతంగా వ్యాప్తి చెందుతోంది. అభివృద్ధి చెందిన దేశాలలో పలు దేశాలు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ కంపెనీలతో వ్యాక్సిన్ల గురించి పలు సంస్థలతో మందుల గురించి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఫలితంగా సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పేద దేశాలు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కరోనా వ్యాక్సిన్, మందుల విషయంలో పేద దేశాలు పడుతున్న ఇబ్బందులను గమనించి 18 ఫార్మా కంపెనీలు ఏకమయ్యాయి. ఈ కంపెనీలు పేద దేశాల కోసమే ప్రత్యేకంగా వ్యాక్సిన్, మందులను ఉత్పత్తి చేస్తూ ఉండటం గమనార్హం. 18 ఫార్మా కంపెనీలలో చైనా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన ఫార్మా కంపెనీలు ఉన్నాయి. మెడిసిన్స్ పేటెంట్ పూల్‌ ఈ దేశాలు ఒక కూటమిగా ఏర్పడి వ్యాక్సిన్, మందుల తయారీకి సిద్ధమవుతున్నాయి.

మన దేశంలోని హెటిరో, నాట్కో, స్ట్ర‌యిడ్స్ షాస‌న్, స‌న్ ఫార్మా, లుపిన్‌, అర‌బిందో, జైడ‌స్ కాడిలా కంపెనీలు కూటమిలో భాగమయ్యాయి. ఎంపీపీ ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ చార్లెస్ గోర్ మాట్లాడుతూ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు జ‌న‌రిక్ కంపెనీల‌న్నీ అసాధారణ రీతిలో సహకారం అందిస్తున్నాయని సమాచారం.

ఈ ఒప్పందంలో భాగస్వామ్యం కుదుర్చుకున్న కంపెనీలు సాంప్ర‌దాయ మందుల‌తో పాటు యాంటీబాడీల‌ను ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉన్న మందులను తయారు చేస్తాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం స‌ప్ల‌య‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు, కంపెనీలు, ఉత్ప‌త్తిదారులు ముందుకొస్తూ ఉండటం గమనార్హం. కంపెనీలు పేద దేశాలలోని ప్రజలకు తక్కువ ధరకే మందులను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి.