https://oktelugu.com/

అనుపమ క్యూట్ వేషాలు.. కుర్రాళ్లు ఫిదా..!

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వర్ కు తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనుపమ పుట్టింది.. పెరిగిదంతా కేరళలో అయినా తెలుగు ప్రేక్షకులకు మాత్రంగా చాలా దగ్గరైంది. ఎంతో చక్కగా తెలుగులో మాట్లాడమేకాకుండా పాటలు పాడుతూ.. రైమ్స్ చెబుతూ కుర్రకారును ఫిదా చేస్తూ ఉంటుంది. Also Read: అక్కినేని హీరోలను లైన్లో పెట్టిన అనిల్ రావిపూడి? అనుపమ పరమేశ్వర్ మల్టిటాలెంటెడ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంలో అనుపమ నటించిన తొలి మూవీ ‘ప్రేమమ్’ తెలుగులోనూ అదే […]

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2020 / 11:33 AM IST
    Follow us on

    మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వర్ కు తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అనుపమ పుట్టింది.. పెరిగిదంతా కేరళలో అయినా తెలుగు ప్రేక్షకులకు మాత్రంగా చాలా దగ్గరైంది. ఎంతో చక్కగా తెలుగులో మాట్లాడమేకాకుండా పాటలు పాడుతూ.. రైమ్స్ చెబుతూ కుర్రకారును ఫిదా చేస్తూ ఉంటుంది.

    Also Read: అక్కినేని హీరోలను లైన్లో పెట్టిన అనిల్ రావిపూడి?

    అనుపమ పరమేశ్వర్ మల్టిటాలెంటెడ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంలో అనుపమ నటించిన తొలి మూవీ ‘ప్రేమమ్’ తెలుగులోనూ అదే పేరుతో రిలీజైంది. అనుపమ నటన చూసిన ప్రేక్షకులంతా ఆమెకు అభిమానులుగా మారిపోయారు. తెలుగులో ఆమె తొలి స్ట్రేట్ మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అఆ’. ఈ మూవీలో నాగవల్లిని నటించి అభిమానులను ఆకట్టుకుంది.

    అనుపమ పరమేశ్వర్ తెలుగులోపాటు తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించిన సౌత్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో ‘అఆ’తోపాటు ‘శతమానం భవతి’.. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’.. ‘కృష్ణార్జున యుద్ధం’.. ‘తేజ్ ఐ లవ్ యు’.. ‘హలో గురు ప్రేమ కోసమే’లో నటించింది. ఇదిలా ఉంటే అనుపమ తాజాగా ఫ్యాన్స్ కోసం పాడిన ఓ రైమ్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

    Also Read: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్

    అనుపమ పరమేశ్వర్ క్యూట్‌ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాడిన ఈ రైమ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అన్నీ నువ్వే నాకు అన్నట్లుగా ఆమె చెప్పిన రైమ్‌ ప్రతీఒక్కరిని ఆకట్టుకుంటోంది. వీడియో చివర్లో ఆమె లాస్ట్‌లో ఇచ్చిన ముద్దు.. చూపించిన లవ్ సింబల్‌ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసేలా ఉన్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ‘ద డ్రామా క్వీన్‌ అని చెబుతూ.. నా బేబీస్‌ అందరికీ ఐ లవ్‌ యు.. నేను పాడే ఈ పాట ఎంతమందికి తెలుసో.. అలాగే నాలా ఈ పాటను ప్రేమించేవారు ఎందరో తెలియజేయండం’టూ అనుపమ ఈ వీడియోని షేర్‌ చేసింది. అనుపమ క్యూట్ గా పాడిన రైమ్ మీకోసం..!

    https://twitter.com/anupamahere143/status/1326790980801064961?s=20